Loading...

సనాతన ధర్మం గురించి పవన్ కేం తెలుసు : కరుణాకరరెడ్డి

 
పవన్ కల్యాణ్ ఒక సూడో స్పిరిచ్యువలిస్ట్ అని తితిదే మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి కొత్త పీ ఠాధిపతిగా పవన్ స్వామిగా అవతరించారని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.  తితిదే మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తిరుపతి (జీవకోన), న్యూస్టుడే: పవన్ కల్యాణ్ ఒక సూడో స్పిరిచ్యువలిస్ట్ అని తితిదే మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి కొత్త పీ ఠాధిపతిగా పవన్ స్వామిగా అవతరించారని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఆయనకు హైందవ, సనాతన ధర్మాల గురించి ఓనమాలు కూడా తెలియవన్నారు. గురువారం రాత్రి తిరుపతిలోని తన నివాసంలో నగర మేయర్   శిరీషతో కలిసి కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడారు. కాషాయం ముసుగులో రాజకీయ లబ్ధి పొందేందుకు పవన్ యత్నిస్తున్నారని, సభలో దేవుడి గురించి మాట్లాడతానని చెప్పి.. జగన్ కేసుల గురించి మాట్లాడారని విమర్శించారు.