Loading...

అమెరికాలో హెలీన్ తుపాను

అమెరికాలో హెలీన్ తుపాను విధ్వంసానికి మృతి చెందిన వారి సంఖ్య 133కు చేరింది. సహాయక చర్యలు పూర్తయ్యే నాటికి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తూపాను ప్రభావంతో సంభవించిన వరద తాకిడికి ఒక ఇల్లు తుడిచిపెట్టుకుపోయిన దృశ్యాలు హెలీన్ తీవ్రతకు అద్దం పడుతున్నాయి. వరద విధ్వంసం సృష్టించిన ప్రాంతాల్లో అధికారులు సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. నార్త్ కరోలినాలో రహదారులు, నీటి వ్యవస్థ దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. వరద బాధితులు ఇబ్బంది పడకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. 

నేపాల్లో భారీ వరద ; 

నేపాల్లో భారీ వరదల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 205కు పెరిగింది. మరో 130 మంది గాయపడగా, మరో 24 మంది గల్లంతైనట్లు సోమవారం అధికారులు ప్రకటించారు. ఒక్క కార్మాండూలోనే 56 మంది మృత్యువాతపడ్డారు. భద్రతా దళాలు గాలింపు, సహాయక చర్యలు మూడో రోజు సైతం  కొనసాగాయి. భారీ వర్షాల కారణంగా దేశరాజధాని  కాఠ్మాండూకు వెళ్లే రహదారులన్నీ   ధ్వంసమయ్యాయి, 20 జల విద్యుత్ కేంద్రాలు దెబ్బతిన్నాయి. గత 45 ఏళ్లల్లో ఇలాంటి స్థాయి వరదలను ఎన్నడూ చూడలేదని పర్యావరణ   నిపుణులు పేర్కొంటున్నారు.