Loading...

జగన్ లడ్డూలు అపవిత్రం చేశారని నేను చెప్పలేదు ; పవన్ కల్యాణ్

నేను ముమ్మాటికీ సనాతన హిందువునే. నా ప్రాణాల్ని అడ్డుపెట్టయినా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాను. దాని కోసం నా రాజకీయ హోదాను, పదవిని, అధికారాల్నే కాదు  నా ప్రాణాల్ని కోల్పోవడానికీ సిద్ధం.  ఉప ముఖ్యమంత్రి  పవన్ కల్యాణ్  తిరుపతి  వైకాపా అధ్యక్షుడు జగన్ అమాయకుడు, సుద్దపూసేమీ  కాదని ఆయనపై మోసం, నేరపూరిత విశ్వాస ఘాతుకం, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలపై 29 కేసులు ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. ఐదేళ్ల వైకాపా పాలనలో తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ఎన్నో అరాచకాలు జరిగాయని.. ఐదేళ్లుగా సనాతన ధర్మంపై దాడి చేస్తూనే ఉన్నారని, అనేక విధ్వంసకర ఘటనలకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. వాటన్నింటిని ఉన్నత న్యాయవ్యవస్థ, జాతి దృష్టికి తీసుకొస్తున్నామని చెప్పారు. తీర్పు ఇచ్చే ముందు వీటన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలని న్యాయవ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కల్తీ   న్యాయవ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కల్తీ నెయ్యితో శ్రీవారి ప్రసాదాలు తయారుచేయడాన్ని చిన్న ఘటనలా తీసేయకూడదని, వైకాపా ప్రభుత్వం నియమించిన తితిదే పాలకమండళ్ల హయాంలో అంతకు మించిన ఘోరాలు అనేకం  చోటుచేసుకున్నాయని పవన్ పేర్కొన్నారు. 'జగన్ తన చేత్తో లడ్డూలు చేశారని, అపవిత్రం చేశారని నేను ఎక్కడా చెప్పలేదు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే వారే భుజాలు తడుముకుంటున్నారు. తప్పు జరిగిందని, విచారణ చేయమని అడుగుతుంటే, రాజకీయం చేస్తున్నామంటారు. ఆ అవసరం మాకేముంది  అని ధ్వజమెత్తారు. సనాతన  ధర్మాన్ని ముట్టుకున్న ఎవరైనా మాడి మసైపోతారని   హెచ్చరించారు. గురువారం తిరుపతిలో  నిర్వహించిన వారాహి డిక్లరేషన్ సభలో ఆయన  మాట్లాడారు.