Loading...

పథకాలు ఇవ్వడమే కాదని ప్రజల ఆదాయాలను పెంచడమే ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు

  ఆర్థిక వ్యవస్థ కుదేలైందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రస్తుతం ప్రతి శాఖలో కొత్త విధానాలు తెస్తున్నామని, వాటి సమర్థ అమలుతో ఆర్థికపురోగతి సాధించాలని ఆదేశించారు. 15% వృద్ధిరేటు సాధించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయాలని సూచించారు. ప్రాథమిక, పారిశ్రామిక, సేవల రంగాల్లో వృద్ధిపై గురువారం ఆయన సచివాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా హాజరైన వివిధ శాఖల అధికారులు.. పదేళ్లలో రంగాలవారీ పరిస్థితుల్ని వివరించారు. ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాదని.. ఆయా రంగాలను బలోపేతం చేసి ప్రజల ఆదాయాలను పెంచడమే ముఖ్యమని చంద్రబాబు వారికి స్పష్టం చేశారు. కొన్ని శాఖలు బాగా వెనకబడి ఉన్నాయని.. మరింత చురుగ్గా పనిచేయాలని చెప్పారు.   

యాంత్రీకరణతో సాగు ఖర్చులు ఆదా ; 

ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు.. వారిపై అదనపు భారం వేయకుండా ప్రభుత్వ ఆదాయం పెంచే విధానాలను అమలుచేయాలని సీఎం సూచించారు. వ్యవసాయంలో సమగ్ర యాంత్రీకరణ ద్వారా రైతుల సాగు ఖర్చులు తగ్గించొచ్చని వివరించారు. 'వచ్చే ఏడాది జనవరిలో పీ4 విధానాన్ని ఆచరణలోకి తెస్తున్నాం. సమాజంలో ఆర్థికంగా ఉన్నతస్థానంలో ఉన్నవారు.. అట్టడుగున ఉన్న 10% మందిని పైకి తెచ్చేందుకు సహాయం చేయాలి. ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు సంపన్నులు, సంస్థలు సీఎస్ఆర్ ద్వారా పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు దోహదపడాలి' అని
సూచించారు.