Loading...

టీడీపీలోకి పునరాగమనం చేసిన, ప్రముఖ బిల్డర్ మరియు రియల్టర్ గుండ్రెడ్డి శివ

బాపట్ల పట్టణంలోని ప్రముఖ బిల్డర్ & రియల్టర్ గుండ్రెడ్డి శివ యాజలి గ్రామ మాజీ సర్పంచ్ తన క్యాడర్‌తో కలిసి తిరిగి టీడీపీ పార్టీలో చేరారు. గతంలో మండల సర్పంచ్‌లకు అధ్యక్షుడిగా పనిచేశారు. టీడీపీ హయాంలో సర్పంచ్‌గా పనిచేసి గ్రామస్థాయిలో ఎంతో అభివృద్ధి చేశారు. మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్‌కు అత్యంత సన్నిహితుడు. ఆయన గ్రామంలో అనేక సిమెంట్ రోడ్ల నిర్మాణం, తాగు మరియు సాగు నీరందించి రైతులకు సహాయం చేశారు. యాజలి గ్రామాభివృద్ధితో పాటు రాజకీయాలలో ఆయన పాత్ర చాలా ముఖ్యమైనది. ఆయనే కీలక పాత్ర పోషించి ప్రస్తుత సర్పంచ్ గెలుపునకు సహకరించారు. యాజలి గ్రామం మెజారిటీ ఓట్లను టీడీపీ పార్టీకి చేరుస్తుందనడానికి స్పష్టమైన నిదర్శనం.

బైక్ ర్యాలీ: బాపట్ల జీబీసీ రోడ్డులో గుండ్రెడ్డి శివ ఆధ్వర్యంలో సుమారు 2000 మందితో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆయన మద్దతుదారులంతా టీడీపీలో చేరారు.

పెద్ద ఎత్తున మహిళలు మరియు యువత తనతో పాటు జాయిన్ అయ్యారు.

పేద కుటుంబాలకు సేవలు మరియు ఆధ్యాత్మిక సేవలకు విరాళాలు: అతను ఏదైనా ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సహాయం మరియు ఆదుకోవడంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రభుత్వం నుండి ఎన్నో నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి పధంలో నడిపారు.తను 10 సంవత్సరాల క్రితం 20 లక్షల సొంత డబ్బుతో యాజలిలోని వినాయక దేవాలయాన్ని పునరుద్ధరించారు.

యాజలి హైవే రోడ్డులో నిర్మించే హనుమాన్ విగ్రహానికి 10 లక్షలు విరాళంగా ఇచ్చారు. బాపట్లలో అనేక సార్లు క్రీడా పోటీలను ఏర్పాటు చేసి బహుమతులు మరియు విరాళాలు కూడా ఇచ్చారు. వచ్చే బాపట్ల ఎన్నికల్లో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తారని మనం ఆశించవచ్చు.

గుండ్రెడ్డి శివ ని -  అన్నా అంటే నేను ఉన్నాను అంటాడు. మన దగ్గర ఎంత డబ్బు వున్నది ముఖ్యం కాదు, ఉన్నదానిలో ఎంతో కొంత దానం చేసినవాడే గొప్పవాడు. ఎల్లప్పుడూ పలు సేవ మరియు ధార్మిక కార్యక్రమాలుకు సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.