Loading...
image

కన్న కూతురికి సెల్యూట్ చేసిన తండ్రి

ఆమె విజయం.. కన్నతండ్రికి గర్వకారణం

కన్నబిడ్డలు ప్రయోజకులైతే తల్లిదండ్రుల సంతోషం మాటల్లో వర్ణించలేనిది. తల్లిదండ్రులకు మించి సక్సెస్ సాధిస్తే అంతకుమించిన గర్వకారణం ఉండదు. తాజాగా తెలంగాణకు చెందిన ఐపీఎస్ అధికారి వెంకటేశ్వర్లు కూతురు తండ్రిని మించిన తనయగా అందరి దృష్టి ఆకర్షించారు. ట్రైనీ ఐఏఎస్ అయిన ఉమాహారతి పోలీస్ అకాడమీకి రాగా అక్కడే డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు కూతురికి సెల్యూట్ చేశారు. ఈ దృశ్యం అందరి మనసును తాకింది.

ఫాదర్స్ డే సందర్భంగా ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది

తొలి హీరో నాన్నే
ప్రతి కొడుకు, కూతురికి తొలి హీరో నాన్నే. మొదటి అడుగులు నేర్పేది ఆయనే. తన పిల్లల సంతోషం కోసం ఇష్టాలను త్యాగం చేసే గొప్ప వ్యక్తి. అమ్మ ప్రేమలో ఆప్యాయత కనిపిస్తే, నాన్న ప్రేమలో బాధ్యత ఉంటుంది. కొండంత ప్రేమను మనసులో దాచుకొని పిల్లల భవిష్యత్తు కోసం తన జీవితాన్నే ఖర్చు చేస్తాడు. కష్టసుఖాల్లో వెన్నంటే ఉంటాడు. ఆయన చేసిన త్యాగాలకు, సేవలకు గుర్తింపు ఇవ్వాల్సిందే.