Loading...

సనాతన ధర్మ రక్షణలో మీరు ఉండండి. సమాజ రక్షణలో మేముంటాం ; ప్రకాశ్ రాజ్

ఇటీవల జరుగుతున్న పరిణామాలపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్   ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సనాతన ధర్మంపై తన స్పందన తెలియజేశారు. 'సనాతన ధర్మ రక్షణలో మీరు ఉండండి. సమాజ రక్షణలో మేముంటాం. ఆల్ ది బెస్ట్ #జస్ట్ ఆస్కింగ్' అని పేర్కొన్నారు.  తిరుమల లడ్డూ మహా ప్రసాదం కల్తీ జరిగిందన్న వార్తలు మొదలైన దగ్గరి నుంచి ప్రకాశ్ రాజ్ ఎక్స్    వేదికగా పోస్టులు   పెడుతున్నారు. ఈ క్రమంలో గురువారం తిరుపతిలో నిర్వహించిన వారాహి సభలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  సనాతన ధర్మంపై మాట్లాడారు. ఆ ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే వ్యక్తిగా.. వారాహి డిక్లరేషను వేంకటేశ్వరుని పాదాల సాక్షిగా ప్రకటిస్తున్నానని అన్నారు. “నేను ముమ్మాటికీ    సనాతన హిందువునే. నా ప్రాణాల్ని అడ్డుపెట్టయినా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాను. దాని కోసం నా రాజకీయ   ఐదేళ్ల వైకాపా పాలనలో తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ఎన్నో అరాచకాలు జరిగాయని.. ఐదేళ్లుగా సనాతన ధర్మంపై దాడి చేస్తూనే ఉన్నారని, అనేక విధ్వంసకర ఘటనలకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని ముట్టుకున్న ఎవరైనా మాడి మసైపోతారని హెచ్చరించారు. 'సనాతన ధర్మం ఒక వైరస్ అని.. దాన్ని అంతం చేస్తా'మని ఇటీవల ఒక యువ నాయకుడన్నారు. తన మాటలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ వినాలంటూ దయనిధి స్టాలిన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్జ్ ట్వీట్   పెట్టడంతో మరోసారి వార్తల్లో నిలిచారు.