Loading...

అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ భాష వేషం ఎందుకు మారాయి ; షర్మిల

కాంగ్రెస్ పార్టీ లోక్సభా పక్షనేత రాహుల్ గాంధీని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విమర్శించడం హాస్యాస్పదమని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ భాష, వేషం ఎందుకు మారాయని ప్రశ్నించారు. విజయవాడలో ఆమె విలేకరులతో మాట్లాడారు. 'ఉన్నతమైన హోదాలో ఉన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ, అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. అలాంటి మీరు ఒక మతమే ముఖ్యమన్నట్లు వ్యవహరించడం పద్ధతిగా ఉందా? ఒక మతానికి చెందిన దుస్తులు ధరించి అధికారిక విధులు నిర్వర్తిస్తుంటే, ఇతర మతాల వారికి అభద్రతా భావం కలగదా? జనసేన ఒక సెక్యులర్ పార్టీ అనే భావన ఉండేది. మతం అడ్డుపెట్టుకొని రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది. మీరు ఆర్ఎస్ఎస్ ఏజెంటా? కేవలం ఒక మతమే ముఖ్యమన్నట్లు మాట్లాడుతున్నారు. ఒక హోదాలో ఉన్నారన్న కనీస ఆలోచన లేకుండా ఒక మతాన్నే భుజాన ఎత్తుకుంటే  మిగతా మతాల వారు ఏమనుకోవాలి' అని  ఉద్దేశించి షర్మిల విమర్శించారు.