Loading...

 జానీ మాస్టర్కు నేషనల్ అవార్డు నిలిపివేత 

జానీ మాస్టర్కు బెయిల్; 

మహిళా కొరియోగ్రాఫర్పై అత్యాచారం కేసులో జైలులో ఉన్న జానీ మాస్టర్కు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తిరు సినిమాలోని 'మేఘం కరిగేనా' పాటకు బెస్ట్ కొరియోగ్రాఫర్గా నేషనల్ అవార్డు అందుకోవడానికి ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రూ.25వేల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది.

 జానీ మాస్టర్కు నేషనల్ అవార్డు నిలిపివేత 

జానీ మాస్టర్కు నేషనల్ అవార్డు నిలిపివేత అత్యాచారం కేసులో అరెస్టై, బెయిల్పై బయటికొచ్చిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు షాక్ తగిలింది. ఆయనకు ప్రకటించిన నేషనల్ అవార్డును తాత్కాలికంగా నిలిపివేశారు. పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా అవార్డుకు ఎంపికైన కొద్దిరోజులకే ఆయనపై అత్యాచార ఆరోపణలు రావడంతో అరెస్టయ్యారు. అవార్డు అందుకునేందుకు జానీకి కోర్టు ఇటీవల మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.

జానీ మాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్ ; 

జానీ మాస్టర్పై అత్యాచారం కేసు పెట్టిన బాధితురాలిపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఆయన భార్య అయేషా ఫిర్యాదు చేశారు. 'నా భర్తను ఆమె ప్రేమ, పెళ్లి పేరుతో వేధించింది. నేను ఆత్మహత్యకు యత్నించేవరకు తీసుకెళ్లింది. బాధితురాలి తల్లి కూడా వేధించింది. నాకు, పిల్లలకు ఏమైనా అయితే వారిదే బాధ్యత. నాకు న్యాయం చేయండి' అని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు జానీ మాస్టర్ 3 రోజుల పోలీస్ కస్టడీ నేటితో
ముగియనుంది.