Loading...

వార్తల్లో నిలిచేందుకు కొందరు సినీ ప్రముఖుల పేర్లు వాడుకుంటున్నారు: చిరంజీవి

 
  సినీ రంగంలో పలువురిపై మంత్రి కొండా సురేఖ అమర్యాదకర వ్యాఖ్యలు చూసి బాధపడ్డానని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. 'వార్తల్లో నిలిచేందుకు కొందరు సినీ ప్రముఖుల పేర్లు వాడుకుంటున్నారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అసత్య ఆరోపణలు చేయడం దారుణం. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని వారిని ఇందులోకి లాగొద్దు. రాజకీయ నేతలు ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ప్రవర్తించాలి' అని ఆయన ట్వీట్ చేశారు.

 మంచు విష్ణు వార్నింగ్  ; 

ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు నటుల పేర్లు, వారి కుటుంబాల పేర్లను వాడొద్దని 'మా' ప్రెసిడెంట్ మంచు విష్ణు ట్వీట్ చేశారు. 'వినోదాన్ని అందించడానికి మేము ఎంతో కష్టపడుతున్నాం. మా వ్యక్తిగత జీవితాలను ప్రజా చర్చల్లోకి లాగొద్దు. మనమందరం ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఇలాంటి ఘటనలు ఎంతో బాధను కలిగిస్తాయి. నా చిత్ర పరిశ్రమను ఎవరైనా బాధపెట్టాలని చూస్తే మౌనంగా ఉండను. మేమంతా ఏకమై   నిలబడతాం' అని హెచ్చరించారు.

నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా కొండా సురేఖ 

 సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. 'నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శం. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను' అని Xలో సమంతను ట్యాగ్ చేశారు.