Loading...

ఎన్నారై జనసేన డల్లాస్ టీమ్ అద్వర్యంలో ఘనంగా జనసేన విజయోత్సవ సంబరాలు

డల్లాస్, టెక్సాస్ (అమెరికా): జనసేన పార్టీ 21కి 21 ఎమ్మెల్యే సీట్లు, పోటీ చేసిన 2 ఎంపీ స్థానాల్లో 2 ఎంపీ సీట్లు గెలుచుకోవడం రాజకీయ చరిత్రలో రికార్డ్, 100% స్ట్రైక్ రేట్‌తో జనసేన పార్టీ అఖండ విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచారు. కావున ఎన్నారై జనసేన డల్లాస్ టీమ్ అద్వర్యంలో కేక్ కట్టింగ్ ఈవెంట్ ద్వారా JSP యొక్క గ్రాండ్ సక్సెస్‌ను ఘనంగా జరుపుకున్నారు . జనసేన విజయాన్ని అందరూ ఆస్వాదించారు.

ప్లానో, స్పైస్ ర్యాక్ రెస్టారెంట్‌లో జరిగిన జనసేన విజయోత్సవ వేడుకల్లో 500+ మందికి పైగా సభ్యులు పాల్గొని పండుగ వాతావరణం లో సంబరాలు జరుపుకున్నారు. 

తొలుత జనసేన నియోజకవర్గాలకు చెందిన వారు మరియు వారి బంధువర్గం వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ఎలా పనిచేశారో, గ్రౌండ్ లెవెల్లో ఎంత కష్టపడ్డారో వివరిస్తూ తమ అనుభవాలను అందరితో పంచుకున్నారు.

తిరుపతికి చెందిన జనసేన నేత డా.పసుపులేటి హరిప్రసాద్ జూమ్ కాల్ ద్వారా కనెక్ట్ అయ్యి జనసేన గెలుపు కోసం ఎలా కష్టపడ్డారో వివరించారు. టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకోవడంలో పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించారని అన్నారు. ఎన్నికలకు ముందు బలమైన వైసీపీ క్యాడర్‌ను ఓడించాలంటే బీజేపీ మద్దతు టీడీపీకి ఎంతో అవసరం. ఎన్నికల తర్వాత కేంద్ర స్థాయిలో బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే టీడీపీ మద్దతు తప్పనిసరి అయ్యింది . కాబట్టి రెండు పార్టీల పొత్తు వల్ల పరస్పర ప్రయోజనాలు ఉన్నాయి మరియు ఈ కూటమి వెనుక ఉన్న కీలక వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే, అందుకే అందరూ అతనిని "గేమ్ ఛేంజర్" అని పిలుస్తున్నారు మరియు అతని వ్యూహాలు జాతీయ స్థాయిలో కూడా సహాయపడుతున్నాయి, పవన్ కళ్యాణ్ యొక్క ముందుచూపుని ప్రశంసించారు. 

విప్పటం సభలో పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో  ప్రభుత్వ వ్యతిరేఖ ఓట్లు చీల్చబోమని, వైసీపీ ఓటమి కోసం పోరాడతామన్నారు.

వైసీపీ ప్రభుత్వం చాలా అహంకారంతో ఉన్నప్పుడు 151 నుంచి 15కి దిగజారుతుందని లేదా ఏదైనా నంబర్ మిస్ అవుతుంది అని పవన్ కళ్యాణ్ గతంలో చేసిన ప్రకటనలను వారు పునరావృతం చేశారు. ఆయన ఏం చెప్పారో అదే జరిగింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 151 సీట్లలో నుంచి 5 ఎగిరి పోయి 11 సీట్లకు పడిపోయింది. పవన్ కళ్యాణ్ జగన్ కి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాడు.

ధర్మం దే విజయం, పొత్తుదే గెలుపు మరియు కూటమిదే పీటం అన్నారు, అదేజరిగింది. 

21 మంది ఎమ్మెల్యే సీట్లు మరియు  2 ఎంపీ సీట్లు గెలిస్తే యావత్ భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తాను అన్నాడు , ఇప్పుడు అదే జరుగుతున్నది ... 

వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడిని జైలు లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ సింహంలా పోరాడాడు మరియు టీడీపీకి అండగా నిలబడ్డాడు అని కొనియాడారు. 

ఎన్నారై జనసేన డల్లాస్ టీమ్ ముఖ్య నాయకులు శివ కొప్పరాటి, డాక్టర్ పూర్ణ చంద్ర సిరికొండ, ఆప్తా మాజీ అధ్యక్షుడు నటరాజ్ యిల్లూరి, సురేష్ చిలంకుర్తి మరియు రాజేష్ వెల్నాటి తదితరులు పాల్గొని జనసేన సాధించిన ఈ ఘన విజయం ఎలా సాధ్యమైందో  ప్రసంగించారు. 

అంతకుముందు, జూన్ 4న  ఎన్నికల ఫలితాల రోజున - ఫ్రిస్కో (టెక్సాస్) లొ,  డల్లాస్ జనసేన మద్దతుదారులు వీర కోట(రియల్టర్) మరియు ఇర్వింగ్(టెక్సాస్) లొ డల్లాస్ బాబీ, శ్రీరామ్ మత్తి , సురేష్ లింగినేని , రాజేష్ కళ్లేపల్లి గార్ల ఆధ్వర్యంలో, వివిధ లొకేషన్స్ లో ఎలక్షన్ రిజల్ట్స్ వాచ్ పార్టీస్ ఏర్పాటు చేసి  జనసైనుకులకు అవధులు లేని ఆనందాన్నిచ్చారు.  అందరు ఏకమై "డల్లాస్ గడ్డని, జనసేన అడ్డాగా" మార్చారు. 

పవన్ కళ్యాణ్ పదేళ్ల నిరంతర కృషి, అంకితభావం, రైతుల కోసం ఆయన చేసిన సాయం, ప్రభావవంతమైన ఆయన ప్రసంగాలు, వ్యూహాల వల్లే జనసేన పార్టీ గొప్ప విజయాన్ని సాధించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు అన్నారు. 

రాష్ట్ర, కేంద్ర రాజకీయాలలో కూడా పవన్ కళ్యాణ్ ప్రముఖ పాత్ర పోషిస్తారని, అది ఆంధ్ర ప్రజలకు మేలు జరుగుతుంది అని అందరూ ఆశిస్తున్నారు.

ప్రస్తుత ఆప్త ప్రెసిడెంట్ త్రినాధ్ ముద్రగడ మరియు Dr . సూర్యనారాయణ సీరం (ఆప్త బోర్డు చైర్) జనసేన పార్టీ ఘన విజయానికి జనసేన కార్యకర్తలకు మరియు పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియచేశారు. 

వాలంటీర్స్ టీమ్ కళ్యాణి పత్తి, ప్రియా అన్నాబత్తిన, సునీత కొండేటి, పావని పెదిరెడ్ల మరియు సునీల్ తోట ఈ కార్యక్రమాన్ని అతి తక్కువ సమయంలో గ్రాండ్ సక్సెస్ చేయడానికి బాగా సహకరించారు.

Photos Link ఈవెంట్ యొక్క మరిన్ని ఫోటోల కోసం దీనిపై క్లిక్ చేయండి

 

Article By: శివ పల్లప్రోలు (Business promotions / News / Event articles, please reach me +1 212 810 0854)