Loading...

వంద రోజుల పాలనలో అభివృద్ధి కనిపించడం లేదా జగన్ ; మంత్రి సుజాత

వైకాపా ప్రభుత్వ హయాంలో మహిళలు పట్టపగలు కూడా బయట తిరగలేని పరిస్థితి ఉండేదని మాజీ మంత్రి, తెదేపా నేత పీతల సుజాత పేర్కొన్నారు. అమరావతి రాజధాని కోసం పోరాటం చేస్తున్న మహిళల్ని ఎన్నో రకాలుగా వేధించారని గుర్తుచేశారు. అధికారం పోయినప్పటి నుంచి జగన్.. బెంగళూరులో పుల్టైం ఉంటూ తాడేపల్లికి పార్ట్ంగా వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్డీయే ప్రభుత్వం వంద రోజుల పాలనలో జరిగిన అభివృద్ధి మీకు కనిపించడం లేదా అని జగన్ను ప్రశ్నించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. 'ఈ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుతో వైకాపా నేతలకు మతి భ్రమించింది. గతంలో రాష్ట్రంలో అరాచకాలు, అకృత్యాలకు పాల్పడ్డవారు.. నేడు నీతులు మాట్లాడుతున్నారు. రూ. పది లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని రుణ ఊబిలోకి నెట్టారు' అని మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక మార్పు మొదలైందని వివరించారు.