Loading...

తిరుమలలో మొదటిరోజు జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్నా ; సీఎం చంద్రబాబు

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు శుక్రవారం జరిగే ధ్వజారోహణంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఉండవల్లి నుంచి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి విజయవాడలోని విమానాశ్రయం చేసుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 5.10 గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో కొంతసేపు విశ్రాంతి తీసుకుని రాత్రి 7.40 గంటలకు బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం ప్రభుత్వం తరపున చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి.. శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. అనంతరం మాడవీధుల్లో జరిగే పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు. రాత్రి 9.20 గంటలకు పద్మావతి అతిథిగృహం చేరుకుని రాత్రికి అక్కడే బసచేస్తారు. శనివారం ఉదయం 7.35 గంటలకు పాంచజన్యం వెనుక నూతనంగా నిర్మించిన వకుళమాత నూతన కేంద్రీయ వంటశాలను ప్రారంభిస్తారు.