Loading...

థాంక్స్ గివింగ్ సందర్బంగా ఆత్మీయ టీమ్ ఆధ్వర్యంలో ఘనంగా ఫుడ్ డొనేషన్ డ్రైవ్

టెక్సాస్‌లోని కారోల్టన్‌లో ఆత్మీయ ఆధ్వర్యంలో  కారోల్టన్ ఫైర్ స్టేషన్ #7 & ది బెయిర్ ఫౌండేషన్‌కు థాంక్స్ గివింగ్ సందర్బంగా ఫుడ్ డొనేట్ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి సేవ చేసే వారి జీవితాల్లో సంతోషాన్ని నింపే స్ఫూర్తిదాయక సేవ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరిగింది.

ఆత్మీయ సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం

ఆత్మీయ ప్రధాన సిద్ధాంతాలు ఎడ్యుకేట్, ఎన్రిచ్, ఎంపవర్, ఎలివేట్ తో ముందుకు సాగుతూ, ఈ కార్యక్రమం ద్వారా కారోల్టన్ ఫైర్ స్టేషన్ #7 అగ్నిమాపక సిబ్బందికి మరియు ది బెయిర్ ఫౌండేషన్ చైల్డ్ & ఫ్యామిలీ మినిస్ట్రీస్ వాలంటీర్లకు ఆహార విరాళాలను అందించింది. ఈ చిన్న చర్య వారు సమాజానికి అందిస్తున్న అద్భుత సేవలకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసింది.

ఆత్మీయ మెంబెర్స్ ఉత్సాహంగా పాల్గొనడం:

ఈ ఫుడ్ డ్రైవ్ ప్రత్యేకంగా ఆత్మీయ సభ్యులు  ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పెద్దలు, పిల్లలు కలిసి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం యువతలో సానుభూతి, సేవా మనోభావాలను పెంపొందించే మజిలీగా నిలిచింది. అగ్నిమాపక సిబ్బందిని, వాలంటీర్లను కలుసుకోవడం పిల్లలకు స్పూర్తిదాయకమైన జీవిత పాఠాలను అందించింది.

ఆత్మీయ నాయకత్వం మరియు సమిష్టి కృషి:

వెంకట్ యెరుబండి గారి నాయకత్వంలో, ఆత్మీయ టీమ్ సమిష్టిగా పనిచేసింది. ఆత్మీయ నార్త్ టెక్సాస్ చాప్టర్ సభ్యులు- నరసింహారావు సత్తి, దుర్గాదేవిశెట్టి, శ్రీనివాస్ దేవిశెట్టి, క్రాంతి తలతం, రవి చినిమిల్లి, కిషోర్ గుగ్గిలపు, సుధీర్ కూనపరెడ్డి, శివయ్య పల్లప్రోలు, రామ్ ఉంగరాల, నవీన్ నాయుడు, రాజకిరణ్ చెన్నారెడ్డి మరియు శశి యెరుబండి  తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కీలక పాత్ర పోషించారు.

ఆత్మీయ దాతల ఉదారతకు హృదయపూర్వక కృతజ్ఞతలు:

ఈ కార్యక్రమం వెనుక నిలబడ్డ దొనొర్స్ సహకారం నిజంగా ప్రేరణదాయకం. అవసరమైన వారికి తోడ్పాటు అందించి, వారి జీవితాల్లో ఆనందాన్ని నింపడంలో ఆత్మీయ దాతల సహకారం విశేషం.


ఆత్మీయ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు!

ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసేందుకు కృషి చేసిన ప్రతి సభ్యుడికి ప్రత్యేక అభినందనలు. మీ అంకితభావం, సేవా తత్పరత ఈ కమ్యూనిటీపై శాశ్వతమైన ముద్రను వేసాయి. థాంక్స్ గివింగ్ స్ఫూర్తిని పంచినందుకు ధన్యవాదాలు!

ఆత్మీయ సేవ, అంకితభావం:

సేవ చేస్తూ, ఆనందం పంచడంలో "ఆత్మీయ" ఎల్లప్పుడూ ముందుంటుంది అని మరోసారి రుజువు చేసింది.  
ఇలాంటి కార్యక్రమాలు ఆత్మీయ యొక్క సేవా పథానికి నిదర్శనం. భవిష్యత్తులో మరింత ప్రభావవంతమైన ఈవెంట్‌లతో కరుణ మరియు సామూహిక కృషి స్ఫూర్తిని కొనసాగించాలని ఆత్మీయ ఆశిస్తోంది.