Loading...

సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా అక్రమ ఇసుక తవ్వకాలను కొనసాగించిన ఏపీ ప్రభుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు ఆదేశాలనుసైతం పట్టించుకోకుండా యథేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలను కొనసాగించిన ఏపీ ప్రభుత్వంపై సుప్రీం ధర్మాసనం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అక్రమ ఇసుక తవ్వకాలను నిలిపివేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశించింది. కమిటీలో కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులనుకూడా నియమించాలని సూచించింది. నాలుగు రోజుల్లోపు అక్రమ ఇసుక రీచ్ లను సందర్శించి వాటిని నిలిపివేయడానికి తగిన చర్యలను తీసుకోవాలని, ప్రతి జిల్లాలో ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక సెల్ లను కూడా ఏర్పాటు చేయాలని, అక్రమ ఇసుక తవ్వకాలను నిషేదించడానికి పెద్దఎత్తున పబ్లిసిటీ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఫిర్యాదులకోసం టోల్ ఫ్రీ నెంబర్లు, ఈ మెయిల్ ఐడీలను కూడా ఏర్పాటు చేయాలని, తమ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కోర్టు థిక్కార చర్యలను తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. కమిటీలోని అధికారులు సుప్రీంకోర్టు నియమించిన అధికారులుగా గుర్తెరిగి విధులను నిర్వర్తించాలని, ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.