ఉదయగిరిలో జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉదయగిరి నియోజకవర్గ నాయకులు బోగినేని కాశీరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి
జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఉదయగిరిలోని స్థానిక బస్టాండ్ సెంటర్లో జనసేన పార్టీ ఉదయగిరి నియోజకవర్గ నాయకులు శ్రీ బోగినేని కాశీరావు గారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. అనంతరం జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని గత 11 సంవత్సరాలుగా పార్టీని సొంత డబ్బులు వెచ్చించి పార్టీ నడుపుతున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగు కొరకే జనసేన, టిడిపి, బిజెపి కలిసి ముందుకు వెళ్తున్నాయని ఈ పొత్తును అందరూ అర్థం చేసుకొని గెలుపుకు కృషిచేయవలసిందిగా కోరారు. ప్రస్తుతం అధికార పార్టీ మెట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని, ఈ ప్రభుత్వం ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పతుందని, ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే ఉదయగిరి నియోజకవర్గ టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ ను సమిష్టిగా గెలిపించుకోవాలని తెలిపారు.జనసేన కార్యకర్తలకు అండగా నిలబడి, రాబోయే కూటమి ప్రభుత్వంలో కార్యకర్తలకు సముచిత స్థానం ఉండేలా కృషి చేస్తానని, నియోజకవర్గ పరిధిలో పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కార్యదర్శి ఆల్లూరి రవీంద్ర గారు , వింజమూరు మండల అధ్యక్షుడు బండారు సత్యనారాయణ గారు, సీతారామపురం మండల అధ్యక్షుడు పాలిశెట్టి శ్రీనివాసులు గారు, ఉదయగిరి మండల అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి గారు, కొండాపురం మండల ఉపాధ్యక్షుడు రాఘవేంద్రరావు గారు, జనసేన నాయకులు బండ్ల హరికృష్ణ, వెలుగోటి సురేష్, కాశీ రత్నయ్య, విఠల్ నారాయణ,నాగేళ్ల రవి, ఇమ్రాన్, అఖిల్, శ్రీను, అనిల్, సురేష్, అంజి, జనసైనికులు, పవన్ కల్యాణ్ గారి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.