Loading...

ఏపీలో త్వరలో మహిళల రక్షణకు "సురక్ష" యాప్

ఏపీలో మహిళల రక్షణ కోసం 'సురక్ష' పేరుతో మహిళా దినోత్సవం(మార్చి 8వ తేదీ) నాటికల్లా ప్రత్యేక యాప్ అందుబాటులోకి తేవాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. మహిళల భద్రత కోసం అన్ని జిల్లాల్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని సూచించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో రాష్ట్ర సచివాలయంలో ఆమె సమీక్షించారు. ప్రతి జిల్లాలో సురక్ష బృందాలను పెట్టి నిఘా పెంచాలని సూచించారు