ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు ఒక అదృష్టం
శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు ఒక అధ్భుతం, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు కలిగిన అదృష్టమీకడిగిన ముత్యం, దేశ చరిత్రలోనే ఆయనదొక అధ్యాయం, జీవన ప్రస్థానం అధ్యయనీయం, నీతి నిబద్ధతలకు నిలువుటద్దం.
ఆర్తులకు సన్నిధిగా నిలిచివుండే పెన్నిధానం, దుర్మార్గుల పాలిట ఉగ్రనరసింహ రుద్రస్వరూపం, సనాతనధర్మ పరిరక్షణా దీక్షాదక్షతకు నడంబిగించి ఆచరించిన తీరు పీఠాదిపతులనే కాక విజ్ఞులైన ప్రపంచ మేధావులను మొత్తం తన వైపు చూసేలా చేసుకున్న అభినవ వివేకానందుడు.
కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఆని అనుచిత వ్యాఖ్యలు చేసి కొరివితో తలగొక్కున్న వ్యక్తిని తుక్కురేగొట్టి 151 నుంచి మధ్యలో వున్న 5 ను పీకిపాతరేసి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా దూరంచేసి, అన్నమాట ప్రకారం అదఃపాతాళానికి తొక్కిన వామనుడే మన పవన్ కళ్యాణ్ అనే ఈ త్రివిక్రముడు.
పరాక్రమాన్ని ప్రదర్శించడు ప్రవర్తనతోనే సమాధానం చెప్పే నేర్పరి. గెలవక గెలవక ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు ఆని హేళనగా మాట్లాడిన వారు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి జూలు విదిలించి ఎమ్మెల్యేగా సింహంలా అసెంబ్లీలో అడుగు పెడితేనే, అహంకారంతో అధికారమదంతో ఉచ్చనీచాలు మరచి విచ్చలవిడిగా అధికార దుర్వినియోగపరచిన అవినీతి ఊబిలో కూరుకుపోయిన కుక్కముతి పిందేలైన రాజకీయ నాయకుల ముసుగులో చెలరేగిన వారికి చుక్కలలోకం చూపించాడు ఇంకా అర్ధం కాలేదా, హాయిని గొలిపే చంద్రుని వెన్నెలలో, చల్లని పవన వీచికలు నడుమ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశాంతంగా మనశ్శాంతితో బ్రతుకుతున్నారు. రాక్షస పాలనను ప్రజలు మళ్లీ కోరుకోరు, మిమ్మల్నీ కోలుకొనివ్వరు.
చంద్ర మోహన్. జక్కా