Loading...
image

ఆంధ్రాలో అన్ని దారులు పిఠాపురం వైపే - మహా కుంభమేళాని తలపిస్తున్న పిఠాపురం ఆవిర్భావసభలో జనసందోహం

"జనసేన" ఆ పేరుతోనే ప్రజలకు ఏదో తెలియని ఆత్మీయ బంధం పెనవేసుకుని ప్రభంజనమై పిఠాపురం ఆవిర్భావ దినోత్సవం సభకు ఉరుకులపరుగులతో ఊరకలేసే ఉత్సాహంతో చేయిచేయి కలిపి ప్రవాహంలా ఊహకందని రీతిలో చేరుకుంటున్న క్రమశిక్షణ కలిగిన జన సైనికుల సందోహాన్ని చూస్తుంటే మహాకుంభమేళ తలపిస్తుంది.

నమ్ముకున్న సిద్ధాంతం కోసం, సేవకుడిగా తుదిశ్వాస వరకూ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సంసిద్దులైన త్రిదళ పోరాట సైనికులనుండి స్ఫూర్తి నింపుకున్న కార్యకర్తల, వీరమహిళల నిస్వార్థ నాయకుల సుమహారమే ఈ జనసేనాపార్టి ఆవిర్భావసభా ప్రాంగణం.

అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ "నేతాజీ, బాపూజీ, అమరాజీవి" ల ప్రతిరూపం. దేశాన్ని అంతర్గత శత్రువుల నుండి కాపాడడానికి అవసరమైతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాగలదు, అనుకున్నది సాధించడానికి శాంతియుత పోరాటంలో  అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు, శ్రీ మహాత్మ గాంధి లను మరిపించగలడు, వారిని స్ఫూర్తిగా తీసుకుని ఎంతటి కస్థాన్నైన ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కలిగి, ఓర్పు సహనాన్ని పట్టుసడలనీయ కుండా అనుకున్నది వంద శాతం చేసి చూపించి సత్తా చాటిన మరో చెగువీరుడు. 

కష్టం ఎవరికీ కలిగిన ముందుగా చెలిస్తాడు, పరిష్కారమార్గాలను త్వరిత గతిన అన్వేషిస్తాడు, విపతులలో యంత్రాంగాన్ని తక్షణం సంసిద్ధం చేసి మానసిక స్థైర్యాన్ని నింపుతాడు. అదే ఆకటాయులు ఆడపిల్లల జోలికొస్తే జ్వలిస్తాడు, చందశాసనుడై పోతాడు, దుర్మార్గుల దోపిడీని  "సీజ్ ద షిప్" ఆని చిరునవ్వు చిందిస్తూ కూల్ గా ఆదేశాలు జారీ చేస్తాడు.

చేయికలిపి కలిసివచ్చే వారితో మనసు విప్పి మాట్లాడుకుని దేశ పునర్వ్యవస్థీకరణ కోసం నడుం బిగించి, నీతి నిబద్ధత కలిగిన నిజమైన దేశోధారకుడు ఆని ఎన్నో సందర్భాలలో ఆచరించిన వ్యక్తిగా, ఉన్నతంగా, ఎదుగుతూ దేశప్రధాని చేత "పవన్" అంటే "గాలి కాదు తుఫాన్" ఆని అనిపించుకున్నా, ఏమాత్రం గర్వం ప్రదర్శించ కుండా "చిరు"నవ్వు చెదరనీయకుండా హుందాగా ప్రశాంతంగా కనిపించే వారాహి అమ్మ వారి మానస పుత్రుడు, భారత మాత ముద్దుబిడ్డ, అపర మేధావి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు.

అవకాశం ఆకాశం నుండి వుడిపడదు, చేతిగీతల్లోనుంచి రాలిపడదు, చేసే పనిలో చిత్తశుద్ధి ప్రణాళిక అలుపెరగకుండా కష్టపడితే ఏదో ఒకనాటికి విజయం సాధ్యమపుతుంది, కష్టంతో కూడుకున్న విజయానికి విలువ ఎక్కువ. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటే, నమ్ముకున్న ప్రజలు నిట్టనిలువునా మునిగి పోతారు అన్న విషయం నమ్మి వున్న పేరును గాని, అన్న పేరును గానీ ఎక్కడ వాడడు, కుటుంబ వ్యవస్థకు పట్టం కడతాడు, నాయకుడుడంటే వున్నది పది రెట్లు పెంచుకునే వాడు కాదు, అన్నివిధాలుగా ప్రజలు పెరగాలి ఆని కోరుకుని వారిపక్షాన నిలబడి నిస్వార్థంగా సేవలందించేవాడే, అభినవ దామోదర సంజీవయ్య, పుచ్చలపల్లి సుందరయ్య మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

శుష్కప్రియాలు పలకదు, పలికిన పదానికి కట్టుబడి నిలబడతాడు. ఇలాంటి నాయకుడు అరుదుగా పుడతారు, అమ్మానాన్నల పేరు నిలబెడతారు.

మన నాయకుడు చేపట్టే ప్రతీ కార్యక్రమం మనం అనుసరించి చేయూతనందించే ప్రయత్నంచేస్తే రాష్ట్రం, దేశం శుభిక్షంగా అన్నిరంగాలలో విజయపథంలో నిలుస్తుంది.

పల్లెసీమలు కళకళ లాడుతూ పచ్చ తోరణం కట్టినట్టు హాయిగా ఆనందంగా పూర్వ వ్యైభం సంతరించి ఆహ్లాదకరం విలసిల్లు తున్నాయి అంటే దానికి ప్రధానకారణం నిజమైన నిస్వార్థ నాయకుడే ప్రజానేత అయ్యాడు కనుక.

కలిసి నడుద్దాం కసిగా సాదిద్దాం.

జై హింద్...
 

చంద్ర మోహన్.జక్కా