Loading...
image

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం - ఆరణి శ్రీనివాసులు శ్రీవారి ఆశిస్సులు కూటమికే

భౌగోళిక పరిస్థితులు: 75 కిలోమీటర్లు సముద్రతీరం కలదు. ఏడాదిలో తిరుపతి టూరిజం ఆదాయం రూ.64.94 కోట్లు. రేణిగుంట విమానాశ్రయం కలదు. తిరుమల, శ్రీకాళహస్తి, తిరుచానూరు, తలకోన, ఎస్వీ జూపార్క్‌ పర్యాటక కేంద్రాలు కలవు. టీటీడీ, శ్రీసిటీ, తెలుగుగంగ, మత్స్యశాఖ ప్రధాన వనరులు.

జనాభ సంఖ్య: మొత్తం జనాభ సంఖ్య 298335 (పురుషులు - 148192 మరియు మహిళలు - 150105)

కులసమీకరణాలు: బలిజ (46068), షెడ్యూల్ కులాలు (24314), రెడ్డి (24198), యాదవ (18261), బ్రాహ్మిణులు (15662), ముస్లిం (15472), కమ్మ (14834), వైశ్య (13128), వన్నెకాపులు (10880), రజక (10124), క్రిష్టియన్లు (10049), క్షత్రియ (9484), కంశాలి (7876), మొదిలియర్లు (7376), నాయిబ్రాహ్మణులు (6052), ముత్తరాశి (5409), గణికులు (4859), షెడ్యూల్ తెగలు (4821), జంగమదేవర్లు (4591), ఈదిగలు (4329), బోయ (4058), గానుగ (3780), కుమ్మరి (3748), వడ్డెర (3413), పద్మశాలీలు (3031), కురబలు (1750), వెలమలు (1200), లింగాయత్లు (769), గవర (298), ఏకిల(255), దొమ్మరి (244), బెస్త (102). 

గత ఎన్నికలు: 2019 ఎన్నికలు పరిశీలిస్తే సుగుణమ్మ (టి.డి.పి) 44% శాతం (79836) + చదలవాడ కృష్ణమూర్తి (జనసేన) 7% శాతం (12315) మొత్తంగా 51% శాతం. అదే గెలిచిన భూమన కరుణాకర రెడ్డి (వై.సి.పి) 45% శాతం (80544) జస్ట్ 798 ఓట్ల తేడాతో గెలిచారు. 2014 జనసేన టి.డి.పి ని బలపర్చడం వలన ఎం.వెంకటరమణ (టి.డి.పి) 41539 ఓట్ల మెజారిటితో గెలవడం విశేషం. 2009లో చిరంజీవి గారు (పి.ఆర్.పి) 15930 ఓట్ల మెజారిటితో గెలిచారు. 

1. ప్రస్తుత ఎం.ఎల్.ఎ భూమన కరుణాకర్ రెడ్డి మీద విపరీత మైన వ్యతిరేకత ఉంది. దానిని సరిగ్గా ఉపయోగించుకోవాలి. అందుకే ఓటమిని ముందుగానే పసిగట్టి తన కుమారుడు భూమన అభినయ్ రెడ్డిని తెరమీదకు తీసుకొనివచ్చాడు. 
2. బ్రాహ్మణులు, వైశ్యులు ఎక్కువుగా బి.జె.పి వైపు మొగ్గుచూపుతారు. కూటమి భాగస్వామ్యం కనుక ఇవి జనసేనకి పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 
ఓట్ ట్రాన్స్ఫర్ జరిగితే తప్పక గెలిచే నియోజకవర్గం. 
3. 80000 ఓట్ల వరకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగులు తిరుపతిలో సెటిల్ అయ్యి ఉన్నారు. వీరికి ప్రతేకమైన సమావేశాలు నిర్వహించి వైసిపి చేస్తున్న అవినీతి, అక్రమాలు, మోసాలు వివరించి మనవైపు తిప్పుకోవాలి. 
4. యాదవులు కూడా అధికంగా ఉన్నారు. వారితో సమావేశాలు నిర్వహించి, వారి సమస్యల పరిష్కారానికి హామీలు ఇవ్వాలి. 

ఆరణి శ్రీనివాస్ గారు అనుక్షణం ప్రజాసమస్యలపై గళం ఎత్తడమే కాకుండా, తిరుపతి ప్రజా దైనందిక సమస్యలు, మునిస్పాలిటి ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సుందర నగరంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక మేన్యుఫెస్టొ అవసరం ఉంది.
 
ఇట్లు,
సురేష్ కరోతు (ఉత్తర అమెరిక)