అల్పపీడన ప్రభావంతో వరద సహాయ నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో వరద సహాయ నిధులు విడుదల చేసిన ప్రభుత్వం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలకు కోటి చొప్పున అత్యవసర నిధులు విడుదల. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంపులు, రక్షిత తాగునీరు, ఆహారం, హెల్త్ క్యాంపులు, శానిటేషన్ కోసం అత్యవసర నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు. వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోవాలని సూచనలు.