Loading...

రాష్ట్రంలో విపరీతమైన వర్షాలు వాయుగుండంగా బలపడిన అల్పపీడనం

నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం    వాయువ్య దిశగా గంటకు 10కిమీ వేగంతో కదులుతున్న వాయుగుండం    చెన్నైకి  440 కి.మీ., పుదుచ్చేరికి  460 కి.మీ,  నెల్లూరుకి  530 కి.మీ దూరంలో ఉంది   వాయుగుండం రేపు తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి మరియు నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉంది.   దీని ప్రభావంతో ఇవాళ  విస్తృతంగాతేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు   దక్షిణకోస్తా & రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు, పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం   రేపు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం    తీరం వెంబడి గంటకు 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు    మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు   ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

రేపు (16/10/2024), అలాగే గురువారం (17/10/2024) విపరీతమైన వర్షాలు ; 

నెల్లూరు - తిరుపతి - ప్రకాశం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ రోజు అర్ధరాత్రి నుంచి రేపు ఉదయం వరకు మరో విడతలో వర్షాలు పడనుంది. తిరుపతి - నెల్లూరు - ప్రకాశం జిల్లాలోని కోస్తా, లోపల ఉన్న భాగాల్లో రానున్న మూడు రోజుల పాటు ప్రత్యేకించి రేపు, అలాగే గురువారం అతిభారీ లేదా తీవ్రమైన వర్షాలు ఉండే విధంగా పరిస్ధితులు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం, ఒక ఉపరితల ఆవర్తనం రెండు పక్క పక్కనే ఏర్పడింది. ఈ రోజు రాత్రి అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారనుంది. అది మన తీరానికి దగ్గరగా వస్తుంది కాబట్టి వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండనుంది.   వాయుగుండం బలహీనపడి గురువారం తిరుపతి జిల్లా మీదుగా ప్రయాణించనుంచి. దీని వలన తిరుపతి నుంచి వైజాగ్ వరకు ఉన్న సుధీర్గ ఆంధ్రా తీరం అంతా మనకు వర్షాలుంటాయి. విశాఖ నగరంలో కూడ వర్షాలు మోస్తరు గా ఉండనుంది. అప్పడప్పుడు సడన్ భారీ వర్షాలు కూడ ఉంటుంది.చిత్తూరు - అన్నమయ్య - వైయస్ ఆర్ కడప జిల్లాల్లో కూడ ఈ తరుణంలో వర్షాలు భారీగా ఉంటుంది.