అమెరికా (డల్లాస్)లో ఎన్నారైల ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి డా.పెమ్మసాని చంద్రశేఖర్ కి ఆత్మీయ అభినందన సభ
డల్లాస్ (సెప్టెంబర్ 14, 2024): డేరింగ్ అండ్ డైనమిక్ లీడర్ - భారతదేశంలో అత్యంత సంపన్న MP మరియు నిజాయతి పరుడు, ప్రముఖ NRI , అనతి కాలంలోనే అత్యధికమైన 3 లక్షల పైచిలుకు మెజారిటీతో గెలిచిన గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. గెలిచిన మొదటిసారే కేంద్రమంత్రి పదవిని అధిరోహించి మన NRI లకు మరియు తెలుగు వారందరికీ గర్వకారణమయ్యారు.
ముందుగా అర్చకులు, ఎన్నారై టీడీపీ నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్‌ను ఘనంగా పూర్ణకుంభంతో సభా ప్రాంగణంలోకి ఆహ్వానించారు.
డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గురించి బాగా తెలిసిన డాక్టర్ శ్రీధర్ ప్రత్తిపాటి, డాక్టర్ సునీత పూదోట, డాక్టర్ చంద్ర నాగినేని వంటి చాలా మంది మిత్రులు/స్నేహితులు వారి అనుభవాలు, స్వీయ జ్ఞాపకాలు మరియు తన గొప్ప గుణాలను పంచుకున్నారు మరియు అతను ఎలా ఎదిగి, భవిష్యత్తు కోసం తన గొప్ప దార్శనిక దృక్పథాన్ని ఎలా ఏర్పరుచుకున్నారో వివరించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు మరియు పిల్లలు 'మా తెలుగు తల్లికి మల్లెపూ దండ' మరియు కొన్ని ఎన్టీఆర్ & బాలకృష్ణ పాటలకు నృత్యం చేసి అలరించారు.
తానా అధ్యక్షుడు కోమటి జయరాం గారు పెమ్మసాని గారితో తన అనుబంధాన్ని తెలియచేశారు మరియు ఆర్థికంగ, నైతికంగా అవసరమైనప్పుడల్లా టీడీపీ పార్టీకి ఎలా అండగా నిలిచారో కొనియాడారు.
టీడీపీ పార్టీ క్లిష్ట దశలో ఉన్న సమయంలో టీడీపీ పార్టీకి మద్దతుగా నిలిచిన ఇతర కూటమి పార్టీలైన జనసేనాని పవన్ కల్యాణ్‌ను కూడా ఆయన ప్రత్యేకంగ కొనియాడారు.
టిడిపి ఎన్నారై కార్యదర్శి సతీష్ వేమన కూడా డాక్టర్ పెమ్మసాని గారు టిడిపి పార్టీ పట్ల ఆయన కఠోర శ్రమ మరియు అంకితభావాన్ని కొనియాడారు, ఎన్నారైలందరికీ ఆయన బాటను చూపినట్లుగా పేర్కొన్నారు మరియు ఎన్నారైల నుండి కేంద్ర మంత్రి అయిన మొదటి వ్యక్తి చంద్రశేఖర్ గారు అని, తనకు అభిమానిగా మారాను అని పేర్కొన్నారు.
డల్లాస్ టీడీపీ విభాగం తరుపున కె.సి. చేకూరి గారు చెప్పిన సాంబయ్య & కోటయ్య కథ హాజరైన వారందరిని ఆకట్టుకుంది మరియు పెమ్మసాని గారి జీవితంలో అధిగమించిన మూడు ప్రధాన మైలురాళ్ళు తెలిపారు.
వేదికపై డాక్టర్ పెమ్మసాని గారి ప్రయాణం యొక్క ఆడియో & వీడియో విజువల్ ప్రదర్శించి అభిమానుల్లో జోష్ ని నింపారు.
తనకి తక్కువ సమయంలో విజయం ఎలా సాధ్యమైందో కూడా వివరించారు . టీడీపీ అధినేత, దార్శనికుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు , లోకేష్‌తో సత్సంబందాలు , తనకి వారినుంచి మద్దతు మరియు ప్రోత్సాహం గురించి తెలిపారు.
ఎన్నికల్లో గెలుపొందేందుకు పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన ఆయనకు ఫిబ్రవరి లోనే టికెట్ కన్ఫర్మేషన్ వచ్చిందని. ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం టీడీపీ క్యాడర్‌ను ఎలా ఇబ్బంది పెట్టిందో తెలియచేశారు.
వైసీపీ రౌడీయిజం, మహిళలను కించపరచారు మరియు సామాన్యులపై దాడులకు తెగబడ్డారు అని గుర్తు చేశారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు వీటన్నింటిని ఎలా ఎదుర్కొని, చక్కని ఎలెక్షనీరింగ్ విధానంతో ఎన్నికల్లో ఎలా ఘన విజయం సాధించారో వివరించారు.
కూటమి పార్టీలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గొప్ప మద్దతు, NRI జనసేన వారి సహకారం మరువలేనిది అన్నారు.
వైసీపీ రౌడీ పాలనకు చరమగీతం పాడి , ఎన్నికల్లో గెలవడానికి గ్రౌండ్ లెవెల్లో పార్టీ క్యాడర్ ఎలా పనిచేసింది, అతను ఎదుర్కొన్న సవాళ్లు మరియు వాటిని ఎలా అధిగమించారో వివరించారు.
టీడీపీ NRI యువసేన వారు దాదాపుగా $32,000/- అమెరికా డాలర్స్ (26 లక్షలు రూపాయలు) గల చెక్కు ను డాక్టర్ పెమ్మసాని గారికి విజయవాడ వరద బాధితులకు సహాయార్థం అందించారు.
ఈ సభకి గుర్తుగా సుధీర్ చింతమనేని, సుగున్ జాగర్లమూడి, TDP NRI నాయకులు అంత కలసి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి శ్రీవేంకటేశ్వరుని ప్రతిమ, శేష వస్త్రాన్ని మరియు అభినందన మాలిక సర్టిఫికేట్ ను ప్రేమతో అందచేశారు.
-----> Siva Pallaprolu <------