Loading...

నెదర్లాండ్స్ లో - హోరెత్తిన జనసేన విజయోత్సవ సంబరాలు

అమెస్టర్డామ్, నెదర్లాండ్స్ (15 జూన్, శనివారం)

జనసైనికులతో అమెస్టర్‌డాం హోరెత్తింది. నెదర్లాండ్స్ ఎన్నారై జనసైనికులు జూన్ 15న జనసేన విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. వచ్చే 2029 నాటికి జనసేనను మరింత చక్కగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన కృషి చేస్తాం అన్నారు . ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా రాష్ట్రాభివృద్ధికి నడుంకట్టిన పవన్ కల్యాణ్ కు అండగా నిలవాలని నిర్ణయించింది. 2024 ఆంధ్రప్రదేశ్ లో  జనసేన పార్టీ ఘనమైన విజయాన్ని అందుకుంది.

జనసేన విజయంలో ప్రవాసాంధ్రుల పాత్ర మరువలేనిది. అమెస్టర్‌డామ్ జనసైనికులు జనసేన పార్టీ విజయంలో ఎంతో కీలకపాత్ర పోషించారు. కొందరు సొంత వూర్లుకి వెళ్లి ఓట్లు వేశారు. మరికొందరు టీమ్స్ గా ఏర్పడి ఆయా నియోజకవర్గాలకు కావలసిన మెటీరియల్స్, ఆర్ధిక వనరులు సమకూర్చి జనసేన విజయానికి పాటుపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా జనసేన విజయాన్ని అందరూ ఆస్వాదిస్తున్నారు. అందులో భాగంగానే అమెస్టర్‌డామ్‌లో విజయోత్సవ సభ జరిగింది.

ఇది ఉద్దేశపూర్వక వ్యక్తుల నుండి నిజమైన ఆలోచనలు మరియు మాటలతో నిండిన అద్భుతమైన రోజు. కుల, మత, సరిహద్దులకు అతీతంగా విభిన్నమైన వ్యక్తుల సమూహంలో జనసేన పార్టీకి అందం ఉంది. మనం కలిసినప్పుడు, మన సానుకూల ఆలోచనలు మరియు వైబ్‌లను ఇతరులకు పంచి, ఆ స్థలాన్ని చాలా శక్తివంతంగా మరియు పవిత్రంగా మారుస్తాము. మా సారూప్య ఆలోచనలు మరియు లక్ష్యాలు మమ్మల్ని ఒకచోట చేర్చాయి. జనసేన జాతీయ పార్టీని ఎదగడానికి మన ప్రయత్నాలను రెట్టింపు చేద్దాం. జనసేన ఒక జీవన విధానం అని ఉదాహరణగా చూపిద్దాం. యూరప్‌లో అవకాశాలను గుర్తించడం మరియు నెదర్లాండ్స్ మరియు ఇతర యూరోపియన్ దేశాలలో పవన్ కళ్యాణ్ గారి పర్యటన కోసం ఒక ఎజెండాను ప్లాన్ చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలి. మనం కలిసి పనిచేసినప్పుడు మనం చాలా ఎక్కువ సాధించగలం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధించిన కూటమి సారధి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరియు "గేమ్ ఛేంజర్" గా, 100 శాతం స్ట్రైక్ రేట్ తో "మాన్ ఆఫ్ మ్యాచ్" మరియు "మాన్ ఆఫ్ సిరీస్" గా నిలిచిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అభినందనలు తెలిపారు.

నిర్వాహకులు ప్రతాప్ సోము, రాజు గరగ, జై, నాగరాజు, బిర్యానీ బాస్ మరియు శ్రీని ఇప్పిలి మొదలైన వారు ఇతరులతో సమన్వయం చేసి చక్కగా నిర్వహించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.

జై హింద్, జై జనసేన అనే నినాదాలతో సభను హోరెత్తించారు 

ఇంటికి దూరంగా.. జనసేన ఆశయాలకు చేరువగా యూరప్ జనసేన ద్వారా దేశసేవకు శ్రీకారం చుట్టిన ఎంతోమంది భావసారూప్యత కలిగిన తెలుగువారితో ఈ ప్రయాణం మొదలైంది.

"రాజకీయం అంటేనే దేశభక్తి"  అనేది వీరి నినాదం. ఇదే స్ఫూర్తితో మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు.