నరసాపురం అడ్డా బొమ్మిడి గడ్డ - జనసేన నుంచి పక్కాగా గెలిచే మరో శాసనసభ్యుడు బొమ్మిడి నాయకర్
జియోగ్రఫీ: నరసాపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక పట్టణం, అదే పేరుగల మండలానికి కేంద్రం. ఇక్కడ గోదావరి నదీతీరం, ఎంబర్ మన్నార్ దేవాలయం, దగ్గరలోగల సముద్రతీరం పర్యాటక ఆకర్షణలు. నర్సాపురం శాసనసభ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలో గలదు. ఇది నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలో భాగం. జిల్లా కేంద్రమైన భీమవరంకు ఆగ్నేయంలో 31 కి.మీ దూరంలో ఉంది.
చరిత్ర: 1580 నుంచి 17వ శతాబ్ది మధ్యభాగం వరకు నరసాపురం నౌకా నిర్మాణ పరిశ్రమకు స్వర్ణయుగం. ఎగువ గోదావరి చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం నుంచి కొట్టిన కలప నౌకా మార్గంలో గోదావరిలో నరసాపురం చేరేది. ఈనాటి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతంలోని అడవులు, గోదావరి లంకల్లో పెరిగిన వృక్ష సంపద వంటివి నరసాపురం నౌకా నిర్మాణానికి కలప దొరికే వనరులుగా నిలిచాయి. దక్కన్ ప్రాంతంలో ఇనుం లభ్యత తక్కువ ఉండడంతో ఇక్కడి నౌకా నిర్మాణంలో మేకుల వాడకం తక్కువగా ఉండేది. కానీ నరసాపురం ప్రాంతానికి మాత్రం ఆంధ్ర ప్రాంతంలోని విస్తారమైన ఇనుప ఖనిజం వల్ల ఆ సమస్య ఉండేది కాదు. కలప, ఇనుం, ఇతర అవసరమైన ముడి సరుకులు ఈ ప్రాంతంలో లభిస్తూండడం ఇక్కడ పరిశ్రమ ఏర్పడడానికి అవకాశం ఏర్పడింది.నరసాపురంలో భారీ నౌకల నిర్మాణం సాగేది. ఆ నిర్మాణమైన నౌకలను ఎగువన వరదలతో గోదావరి పోటు మీదున్న సమయంలో నదీ మార్గంలోంచి సముద్రంలోకి ప్రవేశపెట్టేవారు.నరసాపురంలో తయారైన నౌకలను ప్రధానంగా మచిలీపట్నం నౌకాశ్రయానికి చెందిన వ్యాపారులు వాడేవారు. ఈ నౌకలు బంగాళాఖాతం నుంచి ఎర్ర సముద్రం వరకూ వాణిజ్యం కోసం ప్రయాణించేవి.
వాలంటీర్ వ్యవస్త:
మొత్తం సెక్రేటేరియట్స్: 24
మొత్తం సేక్షండ్ స్ట్రెంత్: 384
వాలంటీర్స్ సంఖ్య: 379
సి.ఎఫ్.ఎం.ఎస్ ఐడి ద్వారా గ్రాంటెడ్ అయిన వాలంటీర్స్: 372
క్లస్టర్స్ కు మేప్ చెయబడ్డ వాలంటీర్స్: 369
నియోజవర్గ పరిదిలో గల మండలాలు: 1. నరసాపురం 2. భీమవరం (పాక్షికం) 3. మొగల్తూరు
నరసాపురం పరిదిలో గ్రామాలు: 1. చినమామిడిపల్లె 2. చిట్టవరం 3. గొంది 4. కంసాలబేతపూడి 5. కొప్పర్రు 6. లింగనబోయినచర్ల 7. లక్ష్మనేశ్వరం 8. లిఖితపూడి 9. మల్లవరం 10. నవరసపురం 11. రుస్తుంబాద 12. సరిపల్లె 13. సీతారాంపురం 14. తూర్పుతాళ్ళు 15. వేములదీవి 16. సారవ
భీమవరం పరిదిలో గ్రామాలు: 1. అన్నవరం 2. బేతపూడి 3. చిన అమిరం 4. దిరుసుమర్రు 5. కొమరాడ 6. కొవ్వాడ 7. లొసరిగుట్లపాడు 8. నరసింహాపురం 9. ఆనకోడేరు 10. రాయలం 11. తాడేరు 12.తుండుర్రు 13. వెంప 14. యనమదుర్రు 15. గొల్లవానితిప్ప
మొగల్తూరు పరిదిలో గ్రామాలు: 1. కాళీపట్నం 2. కుమ్మరపురుగుపాలెం 3. మొగల్తూరు 4. ముత్యాలపల్లి 5. పేరుపాలెం 6. శేరిపాలెం
జనాభ సంఖ్య: సుమారు ఒక లక్షా ముప్పైఆరు వేల ఓట్లు ఉన్న నియోజకవర్గం.
కుల సమీకరణాలు: 23% కాపులు
గత ఎన్నికలు: చరిత్రలోకి తొంగిచూస్తే, 2014లో జనసేన అండతో టి.డి.పి గెలిచింది. 2019 జనసేన ఒంటరిగా పోటి చేసి, వై.సి.పి తో తక్కువ మార్జిన్ 6436 ఓట్లతో రెండవ స్తానంలో వచ్చింది.
ముదునూరు ప్రసాద్ రాజు (55556), బొమ్మిడి నాయికర్ (49120), బండారు మాదవ్ నాయుడు (27059). అంటే జనసేన (35.9%) + టి.డి.పి (19.80%) కలిపితే 55.7%.
ప్రజా సమస్యలు:
1.నర్సాపురం శివారు ప్రాంతాళికి తాగునీరు అందిస్తాం అని మాట ఇచ్చారు కాని కనీసం వాడుక నీరు కూడా అందించలేకపోయారు.
2. ప్రతి గ్రామానికీ భూగర్భ డ్రైనేజీలు కల్పిస్తం అని మాట ఇచ్చారు మాట నిలుపుకున్న దాకలు లేవు.
3. నర్సాపురం నుండి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరికి వంతెన నిర్మాణం అని అన్నారు , గడిచిన 5 సంవత్సరాలు లో కనిసం దానికీ సంబందించిన శంకుస్థాపన కూడా చేయలేదు.
4. నర్సాపురం మున్సిపల్ కేంద్రంగా డంప్ యార్డు ఏర్పాటు చేయకపోడం వల్ల వ్యర్ధాలను ని గోదావరిలో వదిలి పెడుతున్నారు.
5. గత 5 ఏళ్లలో ఒక్క రోడ్డు కూడా మరమ్మతులకు నోచుకోలేదు.
6. మెడికల్ కాలేజీ కోసం ప్రజల సొమ్ముతో భూములు సేకరించారు కానీ ఎమ్మెల్యే దురాశ, కుటిల బుద్ది కారణంగా పాలకొల్లు (లంకెలకోడేరు)కి బదలాయించారు.
8. బియ్యపు తిప్పలు ఫిషింగ్ హార్బర్ ప్రారంభోత్సవానికి సీఎం జగన్ స్వయంగా హాజరై పేదలు, చిన్న భూస్వాముల నుంచి ల్యాండ్‌పూలింగ్‌కు మరియు అభివృద్ధి కోసం 3,300 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. కానీ వాస్తవ అభివృద్ధికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయడం లేదు.
9. రుస్తుంబాద్ లో ఎలక్ట్రిక్ సబ్‌స్టేషన్ మాటే లేదు
10.రైల్వే స్టేషన్ అభివృద్ధికి స్థానికంగా ఎలాంటి చర్యలు లేవు.
11.ఫిషరీ మరియు అనుబంధ యూనిట్ల ఎగుమతి కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంది, అయితే మత్స్య విశ్వవిద్యాలయంపై చర్చ లేదు. ఈ ఫీల్డ్ అభివృద్ధికి ఇది చాలా అవసరం.
వై.సి.పి వైఫల్యాలు:
1. అధికారంలో ఉన్నా అర్హులకు టిడ్కో ఇళ్ళు ఇవ్వలేకపోవడం.
2. జగనన్న కాలనీ స్కీంలో ఎవ్వరికీ అందని ఇళ్ళు.
3. నరసాపురం, మొగల్తూర్ డ్రైనేజ్ సమస్యలు పట్టించుకోకపోవడం.
4. నర్సాపురం డంప్ యార్డ్ సమస్య - కనిసం ఇచ్చిన హామిని కూడా
నెరవేర్చలేదు.
నేటి నర్సపురం ప్రజల నాడి: ఒకసారి బొమ్మిడి నాయకర్ ని ఓడించాం అన్న బాద అక్కడ ప్రజానీకంలో కనిపించింది. ఐదు ఏళ్ళలో ప్రజా సమస్యలపై అవకాశం దొరికినప్పుడల్లా తన గళం వినిపిస్తునే ఉండడం అక్కడి ప్రజానీకంలో మమేకమైయ్యారు.
అదనపు బలాబలాలు: మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు (టీడీపీ) & కొత్తపల్లి సుబ్బరాయుడు (జనసేన) మరియూ ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్.
నాయకర్ వస్తే నర్సాపురం సమస్యలు తీరుతాయి అని బలంగా ఇక్కడి ప్రజలు నమ్ముతున్నారు. తమ సమస్య మూలానుండి తెలిసివాడు, సమస్య పై పూర్తి అవగాహన ఉన్నవాడు మా నాయికర్ అని ప్రజలు విశ్వసిస్తున్నారు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు యువ నాయకత్వం
శ్రీ చంద్రబాబు గారు పరిపాలన ధక్షత
శ్రీ నరేంద్ర మోడి గారు అండదండలు
ఉంటే నర్సాపూర్ నెంబర్ 1 అని యువత అనుకోవడం విశేషం.
వై.సి.పి వాళ్ళలాగ వేలు పంచలేడు మన నాయికర్,
కాని మీ నర్సపూర్ నెంబర్ 1 చెయ్యగలడు,
మీకు, మీ పిల్లలకు బంగారు భవిషత్తు ఇవ్వగలడు.
చివరిగా ఒక్కమాట:
అపురపమైన పులస లాంటోడు మన బొమ్మిడి.
విలువ చేసే వంజరం లాంటోడు మన నాయికర్.
సముద్రంలో కెళ్తే కోత కొయ్యగలడు - వై.సి.పి దండుపాళ్యం బేచ్ తో ఆట ఆడగలడు.
"జనసేన కోసం సొర అయినా అవుతాను, లేదా ఎర అయినా అవుతాను"
ఇట్లు,
సురేష్ కరోతు (ఉత్తర అమెరిక)