శ్రీకాళహస్తిలో జెండా ఊపి కొట్టే వారాహి రథాల ప్రచారం ప్రారంభించిన బొజ్జల సుధీర్ రెడ్డి
TDP - జనసేన ఉమ్మడి ప్రభుత్వ సాధనే లక్ష్యంగా కొట్టే ఉదయభాస్కర్ గారి సౌజన్యంతో కొట్టే సాయి గారి ఆధ్వర్యంలో రాష్త్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తోన్న కొట్టే వారాహి వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన తెలుగుదేశం MLA అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి గారు. ఈ సందర్భంగా కొట్టే వారాహి వాహనాలకు ఎటువంటి ఆటంకం కలగకూడదని కొబ్బరి కాయ కొట్టిన పూజలు నిర్వహించిన బొజ్జల రిషిత రెడ్డి గారు. బొజ్జల సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ "TDP - జనసేన కలయికతో ఈ అవినీతి YCP పాలన అంతం కాబోతోందని, శ్రీకాళహస్తిలో కనీవినీ ఎరుగని మెజారిటీతో YCP ని భూస్థాపితం చేయబోతున్నామని" పేర్కొన్నారు.
కొట్టే సాయి మాట్లాడుతూ " జనసేన - TDP ప్రభుత్వ స్థాపనే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా ఓట్లు గల కొట్టే వారందరూ కలిసికట్టుగా పని చేసి ఈ YCP ప్రభుత్వాన్ని కూలదోయాలని" కోరారు. కొట్టే వారి ఆహ్వానం మేరకు కొట్టే వారాహి వాహనాలను జెండా ఊపి ప్రారంభించడానికి బొజ్జల సుధీర్ రెడ్డి గారు రావడం చాలా సంతోషం అని తెలియజేశారు.
ఆప్త మాజీ అధ్యక్షుడైన ప్రముఖ NRI ఉదయభాస్కర్ కొట్టే మరియు మరికొందరు కొట్టే వారి సౌజన్యంతో జనసేన పార్టీకి
25 వెహికల్స్ ఎన్నికల ప్రచారం కోసం స్పాన్సర్ చేయబడినవి.