డల్లాస్‌లో ఆప్త కార్తీక వనభోజనాలు కార్యక్రమం
తెలుగువారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తమ మూలాలను మరచిపోరని, తమ సాంస్కృతిక వారసత్వ సంపదను కొనసాగిస్తారని డల్లాస్ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ మరోసారి రుజువు చేసింది.
డల్లాస్ సిటీలో తెలుగు ప్రజల వనభోజనాల కార్యక్రమం విజయవంతంగా జరిగింది.
తెలుగు ప్రజలు సోదర భావం, బాంధవ్యంతో ఒకరికొకరు ఘనస్వాగతం తెలియజేసుకుంటూ...
సహృద్భావ స్నేహపూర్వక వాతావరణం లో వనభోజనాల కార్యక్రమం ఆద్యంతం వినోదాత్మకంగా జరిగింది.
తెలుగు ప్రజల పెల్లుబుకిన ఉత్సాహానికి తోడు తెలుగు వంటకాల రుచులు నోరూరించాయి.
ప్రియతమ సోదరుడు స్పైస్ ర్యాక్ రెస్టారెంట్ యజమాని రాజేష్ వెలినాటి
తన అనుభవం రంగరించి తయారు చేయించిన ప్రత్యేక భోజనంలో
నెల్లూరు చేపల పులుసు, బగరా రైస్, వెజిటబుల్ వెరైటీలు, లైవ్ దోస & పూరీ, చికెన్ 65, మటన్ బిర్యానీ వంటి అనేక రకాల రుచికరమైన వంటకాలు అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి.
360 డిగ్రీల ఫోటో సెషన్ మరియు ఫోటో బూత్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
మరోవైపు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన రేపటి పౌరులు పిల్లలు తమ ఆటపాటలతో సందడి చేసి, ఉల్లాసంగా తమ సమయాన్ని గడిపితే,
మహిళలు మెహిందీ మరియు
యువకులు వాలీబాల్ తదితర క్రీడలతో కాలక్షేపం చేశారు.
దాదాపు 800 మందికి పైగా తెలుగు ప్రజలు హాజరు కావడం వల్ల ఈ కార్యక్రమం అంతటా తెలుగువారి తిరునాళ్ళ వాతావరణం నెలకొంది.
ప్రత్యేక లక్కీ డ్రా నిర్వహించిన నిర్వాహకులు విజేతలకు బంగారు నాణేలను, దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సామాగ్రిని బహుమతులుగా అందజేశారు.
అలాగే అతిథులందరికీ బ్యాగులను పంపిణీ చేశారు.
ఆద్యంతం పండుగ వాతావరణంలో - తెలుగుతనం ఉట్టిపడేలా - డల్లాస్ లోని తెలుగు ప్రజలకు ప్రతిక్షణాన్ని ఒక మధుర జ్ఞాపకంగా మలచిన నిర్వాహకులు
రాజేష్ వెలినాటి, సురేష్ లింగినేని, శ్రీరామ్ మత్తి, కిషోర్ అనిచెట్టి, రాజేష్ కల్లేపల్లి, నిమ్మల పల్లవి, డల్లాస్ బాబీ, నటరాజ్ ఏలూరి, శివ కొప్పరటి, గోపాల గూడపాటి మరియు శ్రీరామ్ జెట్టి తదితరులకు ప్రతీ ఒక్కరూ ప్రత్యేకంగా అభినందనలు - శుభాకాంక్షలు తెలిపారు.
(- పల్లప్రోలు శివ , ఫ్రీలాన్స్ రైటర్ )