Loading...
image

పుణెలో ప్రసిద్ధ దగ్దుషేత్ వినాయక ఆలయాన్ని 2 వేల కిలోల ద్రాక్షపండ్లతో అలంకరణ

పూణే, మహారాష్ట్ర: పూణేలోని ప్రసిద్ధ గణేష్ విగ్రహం దగ్దుషేత్ గణపతి ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా లక్షలాది మందిని ఆకర్షిస్తుంది. ఈ విగ్రహం మహారాష్ట్రలోని అత్యంత ముఖ్యమైన గణేష్ విగ్రహాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. భక్తి మరియు వేడుకలకు ప్రతీక అయిన దగ్దుషేత్ గణపతి భక్తుల హృదయాలను కొల్లగొడుతూనే ఉన్నారు.

హోలీ సందర్భంగా మహారాష్ట్రలోని పుణెలో ప్రసిద్ధ దగ్దుషేత్ వినాయక ఆలయాన్ని 2 వేల కిలోల ద్రాక్షపండ్లతో అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని నలుపు, ఆకుపచ్చని ద్రాక్షలతో ఆదివారం సుందరంగా తీర్చిదిద్దారు. సంకటహర చతుర్థి రోజున ద్రాక్ష మహోత్సవ్ (Grapes Festival) ను వేడుకగా చేసుకుంటారు. సహ్యాద్రి ఫామ్స్ ఆధ్వర్యంలో ఆలయాన్ని ద్రాక్షలతో అలంకరించగా.. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. స్వామివారి వద్ద ఉంచిన ద్రాక్ష పండ్లను ససూన్ ఆస్పత్రి, పితాశ్రీ వృద్ధాశ్రమంతో పాటు పలు సంస్థలకు, గణపయ్యను దర్శించుకొనేందుకు వచ్చిన భక్తులకు పంపిణీ చేస్తారు.