Loading...

బలమైన వర్షాలకు అవకాశాలు దక్షిణ కోస్తాంధ్ర మీదుగా విరుచుకుపడనున్న ఫెంగల్ తుఫాన్

దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతం అయిన తిరుపతి, నెల్లూరు జిల్లాల మీదుగా ఫెంగల్ తుఫాన్ నేడు తీవ్రంగా విరుచుకొని పడనుంది. తిరుపతి నగరం, శ్రీకాళహస్తి, గూడూరు, సూళూరుపేట, సత్యవేడు, పుత్తూరు ప్రాంతాల మీదుగా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనుంది. రాగల 24 గంటల్లో వర్షాల తీవ్రత భాగా పెరగనుంది. తుఫాన్ మెళ్లగా కదులుతోంది కాబట్టి వర్షాల తీవ్రత కూడ ఎక్కువగా ఉండనుంది.   నేడు సాయంకాలం నుంచి కోస్తాంధ్ర వ్యాప్తంగా వర్షాలు ప్రారంభించనుంది. వైజాగ్, కాకినాడ, నర్సాపురం, అమలాపురం, ఒంగోలు, మచిలీపట్నం ప్రాంతాల్లో వర్షాలు పెరగనుంది.  తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తీరం వెంబడి 70-90కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు.  నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ కు అవకాశం.  ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని సంబంధిత అధికారులు తెలిపారు.