Loading...

ఆత్మీయ ఆస్టిన్ టీమ్ అధ్వర్యం లో అత్యంత వైభవోపేతంగా మహిళా దినోత్సవ వేడుకలు

ఆత్మీయ ఆస్టిన్ టీమ్ అధ్వర్యం లో ఉమెన్స్ డే ను పురస్కరించుకొని అంబరాన్నంటిన సంబరాలు.

ఆస్టిన్ ప్రాంతంలోని సమీప ప్రాంతాల నుండి పాల్గొన్న ఆత్మీయ మహిళా సోదరిమణులు వింటేజ్ బై  విందమ్ రౌండ్ 

రాక్ హోటల్ అండ్ కాన్ఫరెన్స్ సెంటర్ లో సమావేశమయ్యారు.

మహిళా సమానత్వం మరియు సాధికారత పై ప్యానెల్ చర్చ: పక్షపాతం, అసమానతలను ఎలా అధిగమించాలి మరియు 

వృత్తిలో ఎదగడానికి మార్గాలపై చర్చించారు. మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు సమానమైన పని వాతావరణాన్ని

సృష్టించే వ్యూహాల గురించి చర్చించి ప్రోత్సహించారు.

ప్రేరణాత్మక ప్రసంగం: విజ్జి కూనపరెడ్డి , లేఖ్య నిమ్మల,గీత పసుపులేటి మరియు తదితర మహిళలు జీవితంలో ఎలా

ధైర్యంగా నిర్వహించారో వారి జీవిత పాఠాలను అందించారు మరియు కొత్త తరం మహిళలకు ఆశాకిరణాన్ని అందించారు.

వారు ఆత్మీయ మహిళలకు  విజయవంతమైన విద్యావేత్తలుగా, వ్యాపారవేత్తలుగా ఎలా మారాలి మరియు నాయకత్వం

వహించే విధానాన్ని వివరించారు.  అలాగే జీవితాన్ని విజయవంతంగా నడిపించడానికి మహిళల ప్రాముఖ్యతను వివరించారు.

మహిళలు ధైర్యంగా కార్యక్రమాలను నిర్వహించడానికి మరియు బిడియం లేకుండ  మీ ఆలోచనలను వ్యక్తపరచాలని మరియు

మీ అపారమైన మరియు సృజనాత్మక ఆలోచనలను ఇతరులతో ధైర్యంగా పంచుకుని మీ జీవితంలో ఎదగాలని వారు ఆకాక్షించారు.

ధైర్యం మరియు స్ఫూర్తి: అలాగే గీత పసుపులేటి గారు ఆమె చాల బ్రేక్ తర్వాత ఎలా తన లైఫ్ ని మళ్ళి సాఫ్ట్వేర్ రంగం వైపు

ఎలా స్టార్ట్ చేసారు అనే అంశాన్ని చెప్పి తోటి మహిళలకు ధైర్యాన్ని మరియు స్పూర్తిని కలిగించారు . 

పిల్లల కోసం భవిష్యత్తు ప్రణాళికలు మరియు సేవా ఆధారిత కార్యక్రమాలలో పిల్లలను ఎలా నిమగ్నం చేయాలనే దాని గురించి కూడా చర్చించారు.

నృత్య ప్రదర్శన, ప్రత్యేక ఆకర్షణ : నిహిర తన తోటి సహా డాన్సర్స్ తో చేసిన చక్కటి నృత్య ప్రదర్శన ఎంతగానో

ఆకట్టుకుంది మరియు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.

ఈ సందర్భంగా మహిళలు కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు మరియు మహిళలందరికీ స్నాక్స్‌, కేక్‌లు అందించారు.

దాదాపు 90 మంది మహిళలు, ఈ కార్యక్రమంలో పాల్గొని అత్యంత వైభవంగా నిర్వహించారు.

విజ్జి కూనపరెడ్డి ,లేఖ్య నిమ్మల,స్వప్న సిద్ధం, ప్రసన్న నిమ్మల ,మరియు సాయి కీర్తన గాజుల లు ఈ కార్యక్రమాన్ని

విజయవంతంగా నిర్వహించి అందరిని చాల ఆనందింప చేసారు .
 

విజయానికి దారి : 

మహిళలు వ్యక్తిగతంగా లేదా వృత్తిపరంగా విజయం సాధిస్తే కుటుంబం మొత్తం ఆనందంతో జీవితాన్ని గడుపుతుందని చెప్పారు .

మహిళలు స్వయం శక్తి తో ఎదగాలి అని మరియు అన్నిరంగాలలో విజయవతంగా రాణించాలి అని అభిలషించారు.

చూడ ముచ్చటగా వచ్చిన మహిళలందరితో ఆధ్యంతం ఈ చక్కటి ఈవెంట్ పండుగ వాతావరణం కలిగించింది,

అందరిలో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.

ఈ కార్యక్రమం లో చాల మంది మహిళలు దివ్య,ప్రవీణ,స్వాతి ముత్యాల ,శిరీష బొద్దు ,జాహ్నవి మంగిన ,జయ మండేలా,

ప్రమీల, రామ తులసి ,శ్రీ లక్ష్మి,లలిత బొరుసు,ప్రశాంతి,కిరణ్మయి,భార్గవి,జాహ్నవి,కళ్యాణి ముప్పర్తి,ప్రసన్న గాజుల ,

మమతా, భారతి,భవాని,శైలజ దేవి పెన్నేసేట్ఠి ,రవళి, జాహ్నవి కురచ తదితర మహిళలు పాల్గోని ఈ కార్యక్రమాన్ని

విజయవంతము చేసారు.


ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొన్న మహిళామణులందరికీ  శతకోటి  వందనాలు ...