ఆత్మీయ డల్లాస్ టీమ్ అధ్వర్యం లో మహిళా దినోత్సవ వేడుకలు
ఆత్మీయ డల్లాస్ టీమ్ అధ్వర్యం లో ఉమెన్స్ డే ను పురస్కరించుకొని అంబరాన్నంటిన సంబరాలు.
మహిళలు బెలూన్లు, అలంకరణ వస్తువులతో హాలును అలంకరించారు. డల్లాస్ ప్రాంతంలోని సమీప ప్రాంతాల నుండి
పాల్గొన్న ఆత్మీయ మహిళా సోదరిమణులు కారోల్టన్ "నైస్" ఇండియన్ రెస్టారెంట్ లో సమావేశమయ్యారు.
మహిళా సమానత్వం మరియు సాధికారత పై ప్యానెల్ చర్చ: పక్షపాతం, అసమానతలను ఎలా అధిగమించాలి మరియు
వృత్తిలో ఎదగడానికి మార్గాలపై చర్చించారు. మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు సమానమైన పని వాతావరణాన్ని
సృష్టించే వ్యూహాల గురించి చర్చించి ప్రోత్సహించారు.
శశి యెరుబండి, సజిత తిరుమలశెట్టి తమ జీవితంలోని సవాళ్లను ఎలా అధిగమించారు
మరియు జీవితంలో ఆటు , పోట్లను ఎదుర్కొని ఎలా నిలబడ్డారో ఎలా ధైర్యంగా నిర్వహించారో వారి జీవిత
పాఠాలను అందించారు మరియు కొత్త తరం మహిళలకు ఆశాకిరణాన్ని అందించారు.
వారు విజయవంతమైన వ్యాపారవేత్తలుగా మరియు నాయకత్వం వహించే విధానాన్ని వివరించారు.
అలాగే జీవితాన్ని విజయవంతంగా నడిపించడానికి మహిళల ప్రాముఖ్యతను వివరించారు .
మహిళలు వ్యక్తిగతంగా లేదా వృత్తిపరంగా విజయం సాధిస్తే కుటుంబం మొత్తం ఆనందంతో జీవితాన్ని గడుపుతుందని చెప్పారు .
మహిళలు ధైర్యంగా కార్యక్రమాలను నిర్వహించడానికి మరియు బిడియం లేకుండ మీ ఆలోచనలను వ్యక్తపరచాలని మరియు
మీ అపారమైన మరియు సృజనాత్మక ఆలోచనలను ఇతరులతో ధైర్యంగా పంచుకుని మీ జీవితంలో ఎదగాలని వారు ఆకాక్షించారు.
పిల్లల కోసం భవిష్యత్తు ప్రణాళికలు మరియు సేవా ఆధారిత కార్యక్రమాలలో పిల్లలను ఎలా నిమగ్నం చేయాలనే దాని గురించి కూడా చర్చించారు.
మహిళలు స్వయం శక్తి తో ఎదగాలి అని మరియు అన్నిరంగాలలో విజయవతంగా రాణించాలి అని అభిలషించారు.
ఈ సందర్భంగా మహిళలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు మరియు మహిళలందరికీ స్నాక్స్, కేక్‌లు అందించారు.
దాదాపు 100 మంది మహిళలు, పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొని అత్యంత వైభవంగా నిర్వహించారు.
బిందు నయనాల, వాసవి ఇనపగోళ్ళ, కళ్యాణి సత్తి, విజ్జి చినమిల్లి, సుమథి నాయుడు, స్వాతి చెన్నారెడ్డి వంటి ఎందరో
మహిళలు పాల్గోని ఈ కార్యక్రమాన్ని విజయవంతము చేసారు.
ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ వందనాలు ...