ఆప్త డల్లాస్ టీం ఆధ్వర్యంలో ఘనంగా జాతర & బతుకమ్మ సంబరాలు
ఆబ్రె సిటీలో అట్టహాసంగా నిర్వహించిన ఆప్త డల్లాస్ మెగా జాతర వేడుకలు - భారతీయ సంస్కృతి, సంప్రదాయాల కీర్తిని పెంచుతూ ఘనంగా జరిగాయి. "ఏ దేశమేగినా, ఏ పీఠమెక్కినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని" అన్న రీతిలో కన్నుల పండుగలా వేడుకలు జరిగాయి.
ముఖ్యంగా ఈవెంట్ ఇంత బాగా జరగటానికి రెండు కళ్ళు అయినటువంటి దాతలు మరియు వాలంటీర్లు. మా దాతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు & మా వాలంటీర్స్ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.
2000 మందికి పైగా పాల్గొన్న ఈ ఉత్సవాలలో APTA అధ్యక్షుడు త్రినాధ్ ముద్రగడ గారు, అలాగే కార్యనిర్వాహక బృందం, వ్యవస్థాపకులు, అన్ని రాష్ట్రాల నాయకత్వం హాజరయ్యారు. వేర్వేరు రాష్ట్రాల నుండి ప్రత్యేకంగా డల్లాస్‌కు వచ్చి మరింత కళగా మార్చారు. స్థానిక డల్లాస్ వాలంటీర్ టీమ్ వారికి ఘన స్వాగతం పలికింది. పిల్లలు, మహిళల కోసం ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, ఆహుతుల దృష్టిని మరింతగా ఆకర్షించాయి. వివిధ రకాల ఫుడ్ స్టాళ్ళతో పాటు, ఫ్యాన్సీ స్టాళ్ళు, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెడికల్, స్వీట్స్ స్టాళ్ళు ముఖ్యంగా సందర్శకుల మనసులను గెలుచుకున్నాయి.
ఈ వేడుకలో చిన్నారులు మరియు పెద్దలు ఉత్సాహంగా పాల్గొనేలా అనేక రైడ్స్ ఏర్పాటు చేశారు. జెయింట్ వీల్ , బౌన్స్ హౌస్ , ట్రైన్ రైడ్ , పొనీ రైడ్ , హార్స్ రైడ్ , కరౌసెల్ రైడ్ , మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అట్లతద్దె ఉయ్యాలలు, మొత్తం ఈవెంట్లో అన్ని రైడ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వి లవ్ ఆప్టా మరియు బొమ్మకొలువు, బతుకమ్మ, ఫోటో బూత్ అలంకరణతో ఈ వేడుకలో చూపరులను ఆకట్టుకున్నది. ఫోటో షూట్ల ఏర్పాటు చేయడం ద్వారా మరింత సోయగంగా తీర్చిదిద్దాయి.
వీర కంబాలగారు యువతీ, యువకుల కోసం వివాహ సంబంధాల మాట్రిమోని సదస్సును నిర్వహించగా, రాఫిల్ లక్కీ డ్రా ద్వారా దాదాపు 13 బంగారు నాణేలను బహుమతిగా అందించారు. రాఫిల్ టికెట్స్ అమ్మితే వచ్చిన మొత్తాన్ని ఆప్త విద్యార్థుల ASEP స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌కు విరాళంగా అందజేశారు. రాఫిల్ టిక్కెట్లను శ్రిధర్ ఆకుల గారు మరియు వారి కుటుంబం విజయవంతంగా నిర్వహించారు.
మన APTAలో తొలిసారిగా రాజీ రావుల గారు మరియు వారి టీమ్ సింధు కోన,రూపా కనకాల, అనూష దాసం అందంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అందరి దృష్టిని ఆకర్షించడంతో, అది ప్రధాన అలంకరణగా నిలిచింది. అలాగే, ఈ వేడుకలో తొలిసారిగా సంధ్యా తొట గారి ఆధ్వర్యంలో బతుకమ్మ నిర్వహించడం జరిగింది, ఇది ఈ ఉత్సవానికి మరింత రంగులు చేకూర్చింది. రాజీ రావుల గారు పావని నున్న గారు మరియు వారి టీం నిర్వహించిన కోలాటం ప్రతి ఒక్కరినీ తమ సొంత ఊరిని గుర్తుచేసేలా చేసింది, జాతరలో ఈ కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పిల్లలు , పెద్దలు చేసిన వివిధ డాన్స్ ప్రదర్శనలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మధురాజ్ మరియు అతని టీమ్ ట్రేండింగ్ పాటలకు చేసిన ప్రత్యేక డాన్స్ ప్రదర్శన ఆహుతులను ఉత్సాహపరుస్తూ వేడుకకు కొత్త ఊపును ఇచ్చింది.
స్పైస్ రాక్ మరియు పిస్తా హౌస్ , ఫణి హండీ బిర్యానీ వివిధ రకాలు అయినటువంటి వంటింటి బిర్యానీలు, లైవ్ దోస కౌంటర్లు,మరియు లైవ్ చాట్ కౌంటర్లు, పానీ పూరీ, ఐస్‌క్రీమ్ ఫాలుదా ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేసి , వచ్చినవారందరికి గుమ గుమ లాడే రుచికరమైన ఆహారాన్ని అందించారు. ఫుడ్ స్టాల్స్ ఏర్పటు చేసిన రాజేష్ వెల్నాటి గారికి, రాజేష్ కళ్ళేపల్లి గారికి మరియు ఫణి కోటి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.
మరిన్ని ఫోటోల కోసం, దయచేసి ఈ లింక్‌పై క్లిక్ చేయండి
------------> APTA DALLAS TEAM <-------------