ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి - రాధిక మర్చంట్ హల్దీ వేడుకల ఫోటో షూట్
ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి అంబరాన్నంటుతోంది. మరికొన్ని రోజుల్లో అనంత్- రాధికా మర్చెంట్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. అంబానీ ఇంట జరుగుతున్న ఈ శుభకార్యంపై అందరికీ ఆసక్తే. సోమవారం హల్దీ వేడుక ఘనంగా జరిగింది.
ఇందులో రాధికా ధరించిన పసుపు రంగు లెహంగాపై పూల దుపట్టా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ దుపట్టాలో రాధికా మర్చెంట్ మెరిసిపోయారు. స్టైలిస్ట్ రియా కపూర్, డిజైనర్ అనామికా ఖన్నా వేడుక కోసం ఈ దుపట్టాను డిజైన్ చేశారు. హల్దీ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.