Loading...

డల్లాస్ (అమెరికా) లో దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు గోపికృష్ణ మృతి

బాపట్ల జిల్లాకు చెందిన గోపికృష్ణ మృతి

అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతిచెందాడు. 

మృతుడిని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ (32)గా గుర్తించారు.            

వివరాల్లోకి వెళితే.. 

కర్లపాలెం మండలం యాజలికి చెందిన గోపీకృష్ణ జీవనోపాధి కోసం 8 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. 

డల్లాస్ - గ్యాస్ స్టేషన్‌లో పనిచేస్తున్న గోపికృష్ణని శనివారం తెల్లవారుజామున ప్లెజెంట్ గ్రోవ్‌ సూపర్ మార్కెట్ లో దొంగ కాల్చాడు.

గోపీకృష్ణ కౌంటర్లో ఉండగా.. ఓ దుండగుడు గుర్తుతెలియని నిందితుడు సూపర్ మార్కెట్లోకి ప్రవేశించి, బాధితుడిని కాల్చివేసి వస్తువులను తీసుకున్నాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. తీవ్రగాయాలతో గోపి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. 

అనంతరం దుండగుడు ఓ వస్తువు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.        

ఆ తర్వాత గోపీకృష్ణను ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శనివారం (అమెరికా కాలమానం ప్రకారం) చనిపోయాడు.    

ఈ సమాచారం తెలియడంతో అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. గోపి స్వగ్రామం యాజలిలో విషాదఛాయలు అలముకున్నాయి.    

మరోవైపు దుండగుడు కాల్పులు జరిపిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

అనుమానితుడు ఇద్దరు వ్యక్తులతో వాదిస్తూ వాహనంలో ఉన్నాడని, అతను బాధితులిద్దరినీ కాల్చిచంపాడని మరియు నిందితుడిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.

యాజలి యువకుడు గోపికృష్ణ దారుణ హత్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోపికృష్ణ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. జరిగిన సంఘటన దురదృష్టకరమని ముఖ్యమంత్రి తన సంతాపంలో పేర్కొన్నారు.

Go Fund Link