కూటమి ఘన విజయంతో... అట్టహాసంగా డల్లాస్ లో విజయోత్సవ ర్యాలీ, భారీగా తరలి వచ్చిన తెలుగుదేశం, జనసేన , బీజేపీ శ్రేణులు
డల్లాస్, టెక్సాస్ (అమెరికా, జూన్ 15) : 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బిజెపిలు 175 మందిలో 164 మంది ఎమ్మెల్యేలను, 25 మందిలో 21 ఎంపిలను దాదాపు 94% విజయంతో గెలుచుకున్నారు. ఇంతటి భారీ విజయం గతంలో ఎన్నడూ లేదు. కాబట్టి డల్లాస్‌లోని ఎన్నారైలు టీడీపీ, జనసేన & బీజేపీ జెండాలతో వందల కార్లతో, కార్ల ర్యాలీ కార్యక్రమాన్ని జరుపుకున్నారు.
విజయంలో ప్రవాసాంధ్రుల కూటమి పాత్ర మరువలేనిది. కొందరు సొంత వూర్లకు వెళ్లి ఓట్లు వేశారు , మరికొందరు టీమ్స్ గా ఏర్పడి ఆయా నియోజకవర్గాలకు కావలసిన మెటీరియల్స్ మరియు ఆర్థిక వనరులు సమకూరుస్తూ తెలుగుదేశం, జనసేన మరియూ బీజేపీ పార్టీలు విజయానికి పాటుపడ్డాయి. కూటమి ప్రభుత్వ విజయాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు అందరూ ఆస్వాదిస్తున్నారు.
ఇర్వింగ్ , టెక్సాస్ లో జరిగిన విజయోత్సవ వేడుకలో 2000+ మందికి పైగా సభ్యులు పాల్గొని పండుగ వాతావరణంలో జరుపుకున్నారు.
ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ (విజయవాడ ఎమ్మెల్యే), రఘు రామ కృష్ణం రాజు (ఆర్‌ఆర్‌ఆర్, ఉండి ఎమ్మెల్యే), సుందరపు విజయ్ కుమార్ (యలమంచిలి ఎమ్మెల్యే), కేశినేని చిన్ని (విజయవాడ, ఎంపీ ),కొండపల్లి శ్రీనివాస్ (మినిస్టర్) జూమ్ కాల్ ద్వారా కనెక్ట్ అయ్యారు మరియు ఈ భారీ విజయాన్ని సాధించడానికి ఎన్నారైలు తమ అద్భుతమైన సహాయాన్ని అందించారని ప్రశంసించారు. ప్రవాస భారతీయ తెలుగు వారందరూ తమ సహకారాన్ని, సంపూర్ణ మద్దతును అందించారనడంలో సందేహం లేదు.
ప్రజల సమస్యలు, వైసీపీ ప్రభుత్వ రౌడీయిజం, నిరుద్యోగం, ప్రభుత్వ అవినీతిని ఎన్నారైలు అర్థం చేసుకున్నారు, ఎన్‌ఆర్‌ఐలు ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులను నిశితంగా పరిశీలించారు, మరియు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రజలను ఫోన్ కాల్‌ల ద్వారా మరియు వివిధ సోషల్ మీడియా ఛానెల్‌ల ద్వారా కనెక్ట్ అవ్వడం ద్వారా ప్రభావితం చేసి ఈ విజయం సాధించారు మరియు ఈ ఎన్నికల్లో NRIల పాత్ర చాలా ప్రముఖమైనది.
కూటమి పార్టీల విజయం తర్వాత అమరావతి రాజధాని పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది మరియు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు & పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇతర కొత్త ప్రాజెక్టులు క్యూలో ఉన్నాయి అని పలువురు నాయకులు , వక్తలు పేర్కొన్నారు.
కూటమి విజయంతో అమరావతి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు, అమరావతి అభివృద్ధి మొదలైంది అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధించిన కూటమి సారధి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరియు "గేమ్ ఛేంజర్ " గా, 100 శాతం స్ట్రైక్ రేట్ తో మాన్ ఆఫ్ ది మ్యాచ్ మరియు మాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరు అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్నారై టీడీపీ డల్లాస్ టీమ్, డల్లాస్ జనసైన్యం, బీజేపీ డల్లాస్ టీంలు ఆధ్వర్యంలో ఈ అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించారు.