Loading...

డల్లాస్ ఎన్నారై జనసైనుకుల ఆధ్వర్యంలో అంగ రంగ వైభవంగా జనసేన విజయోత్సవం

డల్లాస్, టెక్సాస్ (అమెరికా): 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో ఎవరు ఊహించనటువంటి విధంగా జనసేన పార్టీ 21 కి 21 ఎమ్మెల్యేలు మరియు రెండింటికి 2 ఎంపీ సీట్లు  100% స్ట్రైక్ రేట్ తో ఘనవిజయం సాధించటంతో  అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో NRI జనసేన క్యాడర్ మరియు నాయకులు ఆనందాన్ని పొందుతూ  విజయోత్సవ కార్యక్రమాలను జరుపుకుంటున్నారు. జనసేన విజయంలో ప్రవాసాంధ్రుల పాత్ర మరువలేనిది. డల్లాస్ జనసైనికులు జనసేన పార్టీ విజయంలో ఎంతో కీలకపాత్ర పోషించారు. కొందరు సొంత వూర్లుకి వెళ్లి ఓట్లు వేశారు , మరికొందరు టీమ్స్ గా ఏర్పడి ఆయా నియోజకవర్గాలకు కావలసిన మెటీరియల్స్ మరియు ఆర్ధిక వనరులు సమకూరుస్తూ జనసేన విజయానికి పాటుపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా జనసేన విజయాన్ని అందరూ ఆస్వాదిస్తున్నారు.

లూయిస్‌విల్లేలోని కాకతీయ బైంక్వెట్ హాల్‌లో జరిగిన జనసేన విజయోత్సవ వేడుకలో 500+ మందికి పైగా సభ్యులు పాల్గొని పండుగ వాతావరణంలో జరుపుకున్నారు.

ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్యేలు లోకం మాధవి (నెల్లిమర్ల ఎమ్మెల్యే), బొలిశెట్టి శ్రీనివాస్ (తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే), మండలి బుద్ధప్రసాద్ (అవనిగడ్డ ఎమ్మెల్యే), ఆరణి శ్రీనివాసులు (తిరుపతి ఎమ్మెల్యే), వరుపుల సత్యప్రభ (ప్రత్తిపాడు ఎమ్మెల్యే), నాగబాబు (జనసేన జాయింట్ సెక్రటరీ), దిల్ రాజు (ఫిలిం ప్రొడ్యూసర్), తుమ్మలబాబు (JSP కాకినాడ జిల్లా అధ్యక్షులు) మరియు దర్శి ఇంచార్జి NRI వెంకట్ జూమ్ ద్వారా కనెక్ట్ అయి ఎన్నారైలు చేసిన విశేషమయిన సేవలు గురించి మరియు ఎన్నికల సంగ్రామంలో ఎన్నారైల  పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు.ప్రవాస భారత తెలుగు వారు అందరూ కూడా ఎంతో సహకారాన్ని మరియు సంపూర్ణ మద్దతు తెలియచేసారు అనటం లో ఎటువంటి సందేహము లేదు అన్నారు. టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకోవడంలో పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించారన్నారు. ఎన్నికల ముందు బలమైన వైసీపీ క్యాడర్‌ను ఓడించాలంటే టీడీపీకి బీజేపీ మద్దతు తప్పనిసరి. ఎన్నికల తర్వాత కేంద్ర స్థాయిలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే టీడీపీ మద్దతు తప్పనిసరి అయింది. కాబట్టి రెండు పార్టీల కూటమికి పరస్పర ప్రయోజనాలు ఉన్నాయి మరియు ఈ కూటమి వెనుక ఉన్న కీలక వ్యక్తి పవన్ కళ్యాణ్, అందుకే అందరూ అతనిని "గేమ్ ఛేంజర్" అని పిలుస్తున్నారు మరియు అతని వ్యూహాలు జాతీయ స్థాయిలో కూడా సహాయపడుతున్నాయి, పవన్ కళ్యాణ్ దూరదృష్టిని మెచ్చుకుంటున్నారు. ఇటీవల గెలిచిన ఎమ్మెల్యేలు ఇక నుంచి కష్టపడి ప్రజలకు సేవ చేస్తాం అని , అన్ని వర్గాల ప్రజల ప్రేమ, ఆప్యాయతలను పొందుతామని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం అవినీతికి తావు లేకుండా పని చేస్తాం అని చెప్పారు. 

వైసీపీ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను కుల నాయకుడిగా ముద్ర వేయడానికి ప్రయత్నించింది, కానీ అది ఎవ్వరు నమ్మలేదు మరియు ప్రజలు కూటమి ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ(94% విజయం) ఇచ్చారు.  

గతంలో, విప్పటం సభలో పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో  ప్రభుత్వ వ్యతిరేఖ ఓట్లు చీల్చబోమని, వైసీపీ ఓటమి కోసం పోరాడతామన్నారు, అసంకల్పమే ఈ విజయానికి దోహదపడింది.

వైసీపీ ప్రభుత్వం చాలా అహంకారంతో ఉన్నప్పుడు 151 నుంచి 15కి దిగజారుతుందని లేదా ఏదైనా నంబర్ మిస్ అవుతుంది అని పవన్ కళ్యాణ్ గతంలో చేసిన ప్రకటనలను వారు పునరావృతం చేశారు. ఆయన ఏం చెప్పారో అదే జరిగింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 151 సీట్లలో నుంచి 5 ఎగిరి పోయి 11 సీట్లకు పడిపోయింది. పవన్ కళ్యాణ్ జగన్ కి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండ చేశాడు.

ధర్మం దే విజయం, పొత్తుదే గెలుపు మరియు కూటమిదే పీటం అన్నారు, అదేజరిగింది. 

21 మంది ఎమ్మెల్యే సీట్లు మరియు  2 ఎంపీ సీట్లు గెలిస్తే యావత్ భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తాను అన్నాడు , ఇప్పుడు అదే జరుగుతున్నది ... 

వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడిని జైలు లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ సింహంలా పోరాడాడు మరియు టీడీపీకి అండగా నిలబడ్డాడు అని కొనియాడారు. 

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గురించి భారత పార్లమెంట్ లో  ఇతను పవన్ కాదు ఆయన ఒక "తుఫాన్" అని అన్నారు. అందరు అది గుర్తు చేసుకున్నారు. 

ఎన్నికలకు ఓటు వేయడానికి భారతదేశానికి వెళ్లిన ఎన్నారై జనసేన నాయకుడు విజయ్ కటకం మరియు ఇటీవల అనారోగ్య సమస్యలతో మరణించిన ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు గారికి సంఘీభావంగా  అందరూ 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలియచేశారు. 

NRI డల్లాస్ జనసేన లీడర్షిప్ టీం  డల్లాస్ బాబీ , సురేష్ లింగినేని , శ్రీధర్ లింగినేని, రాజేష్ కళ్ళేపల్లి(ఇంటర్ప్రెనేర్ మరియు ఫిలిం ప్రొడ్యూసర్)  , శ్రీరామ్ మత్తి , కిశోరె అనిశెట్టి  మరియు యాంకర్ సజిత తిరుమలశెట్టి తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సజిత గారు చక్కటి యాంకరింగ్‌తో ఆద్యంతం జనసైనికులలో జోష్ ని నింపారు.

 అందరు ఏకమై "డల్లాస్ గడ్డని, జనసేన అడ్డాగా" మరో సారి రుజువు చేశారు.. 

పవన్ కళ్యాణ్ పదేళ్ల నిరంతర కృషి, అంకితభావం, రైతుల కోసం ఆయన చేసిన సాయం, ప్రభావవంతమైన ఆయన ప్రసంగాలు, వ్యూహాల వల్లే జనసేన పార్టీ గొప్ప విజయాన్ని సాధించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు అన్నారు. 

రాష్ట్ర, కేంద్ర రాజకీయాలలో కూడా పవన్ కళ్యాణ్ ప్రముఖ పాత్ర పోషిస్తారని, అది ఆంధ్ర ప్రజలకు మేలు జరుగుతుంది అని అందరూ ఆశిస్తున్నారు.

ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ కు కృషి చేసిన వాలంటీర్ టీమ్‌కి ధన్యవాదాలు, పార్థ, చైతన్య పాండ, వెంకట్ లంక, మంజునాథ్ అరిగెల, రాఘవ్ అడపా, గోపాల్ తాడివాక మరియు శివ పల్లప్రోలు తదితరులు మరియు జనసేన వీర మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు సునీత కొండేటి , ప్రియ అన్నాబత్తిన  , లావణ్య గేదెల, పద్మిని శ్రీపతి మరియు భవాని నైనాల తదితరులు.

Photos Link ఈవెంట్ యొక్క మరిన్ని ఫోటోల కోసం దీనిపై క్లిక్ చేయండి

Article By: Siva Pallaprolu