బర్మింగ్హామ్ (యూకే) లో ఘనంగా జనసేన విజయోత్సవ సంబరాలు
UK జనసేన :- UK లో ఉన్న బర్మింగ్హామ్, సోలిహాల్ నగరం లో జూన్ 15th, 2024న జనసేన పార్టీ ఘన విజయం ని అక్కడ మిడ్లాండ్స్ పరిసర ప్రాంతాలలో ఉన్న జనసైనికులు & వీరమహిళలు ఫ్యామీలీస్ తో వచ్చి సంబరాలు అంబరాలు తాకేల జరుపుకొన్నారు.
ఈ ఈవెంట్ ని యూకే-జనసేన ఆధ్వర్యం లో బర్మింగ్హామ్ బృందం నిర్వహించారు ఇందుకు గాను UK జనసేన టీం సలహాలు సూచనలు ఇవ్వటం జరిగింది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి 2024 దాక ఎన్నో ఒడిదుతుకు ఎదురుకొని ఇప్పటి దాక ప్రయాణం చేసిన వీడియో క్లిప్స్ మరియు ప్రమాణ స్వీకార చేసిన వీడియోస్ ని ప్లే చేసి వచ్చిన ఆడియన్సు ని ఉత్సహపరిచటం జరిగింది. మరియు ఈవెంట్ కి విచ్చేసిన పెద్దలు పిల్లలతో కలిసి జనసేన విక్టరీ కేక్ ని కట్ చెయ్యటం జరిగింది. అనంతరం అక్కడికి విచ్చేసిన జనసేన, టీడీపీ మరియు బీజేపీ నాయకులు జనసేన మరియు కూటమి విజయం ముఖ్యంగ జనసేనాని సారథ్యం లో జనసేన సాధించిన 100 % స్ట్రైక్ రేట్ గురుంచి వారి భావాలను సంతోషం తో పంచుకోవటం జరిగింది.
2014 నుంచి ఇప్పటి వరుకు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యే దాక తోడుగా ఉండి మరియు నా సేన కోసం నా వంతులో భాగంగా సహాయ సహకారాలు ఇచ్చిన జనసైనికులకు మరియు వీరహాలలుకు బర్మింగ్హామ్ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియచేసారు.అంతేకాకుండా ఈ సంబరాలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి, టీడీపీ , బీజేపీ శ్రేణులకు కూడాను కృతజ్ఞతలు తెలియచేసారు.
ఈ ఈవెంట్ లో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కొణిదెల గారు, జనసేన నాయకులు జేస్ప్- భీమలి ఇంచార్జి పంచకర్ల సందీప్, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని రాయపాటి అరుణ గారు, వీడియో లో వారి శుభాకాంక్షలు మరియు సంతోషాన్ని ఆడియన్స్ తో పంచుకోవటం జరిగింది.
ఈ ఈవెంట్ ని అచ్యుతరాజు కుర్మాపు, శ్రీ వదన వరజాల, హేమరాజ్ గెల్లి , సందీప్ రెడ్డి కొప్పుల, కోటేష్ కంకిపాటి, శివ మామిళ్ళ, శ్రీధర్ భూపతి, పవన్ కళ్యాణ్ బొల్లం, అమల చలమలశెట్టి, పద్మజ రామిశెట్టి, శంకర్ సిద్ధం, నాగరాజు వడ్రాణం, చంద్ర సిద్ధం, మనోజ్ మంత్రాల, శివ మేక, నాగేంద్ర సోలంకల, శ్రీవల్లి తిరుమల, శివ రామిశెట్టి,గిరిబాబు గడ్డం, శ్రీధర్ పాలబాతిని, శిరీష కుర్మాపు, భాస్కర్ గుర్లంక, మురళీకృష్ణ పసుపులేటి, హరి పిల్లల, శేషేంద్ర శేష భట్టర్, జ్యోతి ముత్యాల, వంశీ జొన్న, రవితేజ వాకా, వినయ్ కుమార్ చిరంజీ, చలపతి నాయుడు,అనూష యంసాని, పవన్, లక్ష్మణ్ దాసరి సహాయ సహకారంతో జరిపించడం జరిగింది.