Loading...

వార్ ఒన్ సైడ్ ఇన్ భీమవరం - జెనసేన జెండ పక్కాగా ఎగిరే మరో నియోజకవర్గం. అంజిబాబు అడ్డా భీమవరం గడ్డ

జియోగ్రఫి: భీమవరం నియోజకవర్గానికి తూర్పున పాలకొల్లు, పడమర, ఉత్తరాన ఉండి, దక్షిణా కష్ణా జిల్లా పెడన నియోజకవర్గాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఉత్తరంగా 135 కి.మీ దూరంలో ఉంది. 

చరిత్ర: తూర్పు చాళుక్య రాజైన భీమ పేరు మీద ఈ పట్టణానికి భీమవరం అనే పేరు వచ్చింది. నియోజకవర్గంలో ప్రధానంగా టూరిజంస్పాట్‌గా  పంచరామక్షేత్రాల్లో ఒకటైన శ్రీసోమేశ్వరజనార్ధనస్వామి ఆలయంతోపాటు శ్రీమావుళ్లమ్మ అమ్మవారి ఆలయం ఉంది. భీమవరంలోని సోమేశ్వరస్వామి దేవాలయం (భీమారామం) పంచారామాలలో ఒకటి. ఈ భీమారామము భీమవరమునకు రెండుకిలోమీటర్లదూరంలో గునుపూడిలో ఉంది. ఇక్కడిలింగమును చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థలపురాణంలో చెప్పబడుతుంది; చంద్రుని పేరున దీనిని సోమేశ్వరక్షేత్రమని పిలుస్తారు. మావుళ్ళమ్మ గుడి: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని గ్రామదేవతల ఆలయాలలో దీనికి ఆదాయము ఎక్కువ. ఇది పట్టణ నడిబొడ్డున ఉంది. 

జనాభ సంఖ్య: సుమారు రెండు లక్షల ఏబైఒక్క వేల మూడువందల ఎనబైమూడు 251384 ఓటర్స్ ఉన్నారు. పురుషులు 122306 & మహిళలు 129028. 

కుల సమీకరణాలు: కాపు - 22.57% (61112),తూర్పు కాపు - 5.98% (16202), శెట్టిబలిజ - 16.06% (34077), మాల - 9.79% (26500), అగ్నికుల క్షత్రియులు -  6.67% (18051).    

గత ఎన్నికలు: 2019 ఎన్నికలలో ఇక్కడ వైసిపి 70642 (36.78%)  ఓట్లతో గెలిచింది. అదే సమయంలో జనసేన 62285 (32.43%) + టి.డి.పి 54037 (28.14%) మొత్తంగా చూసుకొంటే 116322 (60.57%). 
అదే 2014లో జనసేన టి.డి.పి కి సపోర్ట్ చెయ్యడం వలన సుమారు 51.61% (90722) ఓట్లతో వైసిపి ని (43.81%) 77046 ఓట్లకు కట్టడి చేసి సునాయసంగా గెలిచింది. 

వాలంటీర్ వ్యవస్త: 
మొత్తం సెక్రేటేరియట్స్: 23
మొత్తం సేక్షండ్ స్ట్రెంత్: 399
వాలంటీర్స్ సంఖ్య: 389
సి.ఎఫ్.ఎం.ఎస్ ఐడి ద్వారా గ్రాంటెడ్ అయిన వాలంటీర్స్: 375
క్లస్టర్స్ కు మేప్ చెయబడ్డ వాలంటీర్స్: 371

నియోజవర్గ పరిదిలో గల మండలాలు: 1. భీమవరం (పాక్షికం) 2. వీరవాసరం

భీమవరం పరిదిలో గల గ్రామాలు: 1.అన్నవరం, 2. బేతపూడి, 3. చిన అమిరం, 4. దిరుసుమర్రు, 5. కొమరాడ, 6. కొవ్వాడ, 7. లోసరిగుట్లపాడు, 8. నరసింహాపురం, 9. ఆనకోడేరు, 10. రాయలం, 11. తాడేరు, 12. తుండుర్రు, 13. వెంప, 14. యనమదుర్రు, 15. గొల్లవానితిప్ప.

వీరవాసరం పరిదిలో గల గ్రామాలు: 1. పంజావేమవరం, 2. అందలూరు, 3. బొబ్బనపల్లె, 4. కొణితివాడ, 5. మత్స్యపురి, 6. మత్స్యపురిపాలెం, 7. మడుగుపోలవరం, 8. మెంతెపూడి, 9. నవుడూరు, 10. నేలపోగుల, 11. రాయకుదురు, 12. తోకలపూడి, 13. తోలేరు, 14. వీరవాసరం

ప్రజా సమస్యలు: 
1. డంపింగ్ యార్డ్ - రోజుకు 85 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. చెత్తతో నిండిపోయిన యనమదుర్రు డ్రైన్లు. మునిస్పల్ అధికారులు ఇక్కడే చెత్త వేస్తున్నారు. దీనితో కాలుష్యంతో ప్రజలు అనారోగ్యంపాలు అవుతున్నారు. నిశితంగా గమనిస్తే యనమదుర్రు పక్కనే ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాల ఈ డంపింగ్ వలన మూసివేశారు అంటే పరిస్తితి ఎంత త్రీవంగా ఉందో. 
2. రోడ్ల సమస్యలు - పెరుగుతున్న జనాబా దానికి సరిపడా రోడ్లు లేవు సరికదా? ఇంకా గుంతలు, చెత్త. భీమవరం ఒన్ టౌన్ నుండి టు టౌన్ కలిపే రోడ్లు మరియు విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు. 
3. ఆక్యా వెతలు - భీమవరం అంటేనే రొయ్యలు, చేపల చెరువులు సమృద్దిగా ఉండే ప్రాంతం. ఇక్కడ కలుషిత నీటిని శుద్దిచేయడానికి జిరో-లిక్యిడ్ డిస్చార్జ్ చేయడానికి తక్కువ వడ్డికి రుణాలు ఇస్తే నీటిని శుద్దీకరణ చెయ్యొచ్చు. 
4. కాల్యుష్యం - డంప్ యార్డ్ కాల్స్తున్నప్పుడు వ్యర్ధ పదార్ధాల నుండి వచ్చే కలుషిత గాలి వలన ప్రజలు అనారోగ్యం పాలు అవుతున్నారు. అలాగే పెరుతున్న ట్రాఫిక్ వలన వచ్చే పొగ, కలుషిత నీటి నుండి వచ్చే కాలుష్యం, వీటి వలన ప్రజలు దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారు. 
5. తాగు నీటి సమస్య - చెరువులు, కాలువలు కలుషితం అవ్వడం వలన ఇక్కడ తాగునీటి సమస్య అత్యదికంగా ఉంది. ముఖ్యంగా వీరవాసరం అయితే మరీ ఘోరం. 
6. ఇళ్ళ సమస్య - బడుగు బలహీన బిసి వర్గాలకు కనీసం ఉండడానికి ఇళ్ళు లేవు. 
విచిత్రం ఏంటంటే భీమవరం నియోజకవర్గంలో అవసరాల మేరకు కనీసం స్మశానవాటికలు కూడా లేవు. 

వైసిపి వైఫల్యాలు:
నేను ఉన్నా అన్నాడు, నేను విన్నా అన్నాడు. అలాగే ఐదు ఏళ్ళు గడిచిపోయాయి. 
1. జగన్ ప్రత్యేకంగా హామి ఇచ్చిన డ్రైనేజ్ సమస్య నేటికి అలాగే ఉంది. 
2. జగన్ ప్రభుత్వం వచ్చిన పేదలకు, ఎస్.టి/ఎస్.సి/బి.సి లకు గృహవసతి కల్పించక పోవడం కడు శోచనీయం. 
3. కొత్తగా బైపాస్ రోడ్లు లేవు, ఇంకా నేటికి కాలువల పై గ్రామాలు దాటవలసిన దౌర్బాగ్యం. 

జనసేన భీమవరం మేనిఫెస్టో:
1. యల్లప్రగడ సుబ్బారావ్ గారి పేరు మీద 1000 పడకల ఆసుపత్రి.
2. డొక్క సీతమ్మ గారు పేరు మీద మహిళా క్యాంటీన్లు.
3. గవర్మెంట్ మెడికల్ కాలెజ్ తీసుకొనివచ్చే విదంగా చర్యలు. అలాగే పాలిటెక్నిక్ మరియు ఎయిడెడ్ కాలేజీలకు మరిత సదుపాయాలు కల్పించడం. 
4. మంచి ఉద్యానవనాలు, వ్యాయామశాలలు, క్రీడా మైదానాల ఏర్పాటు. 
5. మార్కెట్ షెడ్స్ మరియు మర్కెట్ యార్డ్స్ నిర్మానం. 
6. డ్రైనేజ్ సమస్య మొదటి సంవస్తరంలోనే పరిష్కారం. 
7. భీమవరం ఐ.టి/ సాఫ్ట్వేర్ సెకండ్ టెయిర్ సిటీగా తీర్చిదిద్దుటకు ఐ.టి పార్క్ ఎర్పాటు. 
8. రక్షిత మంచినీటి పదకం. 
9. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా యువతీ యువకులకు ఉపాది అవకాశాలు. 
10. దొంగ్పిండి శివారు పశ్చిమ గోదావరి లక్ష్మీపురం లాకులు కలిపే ఉప్పుటేరు బ్రిడ్జ్ నిర్మానం. 
11. దొంగపిండి, గోగుతిప్ప పరిసర గ్రామాల రైతులు పొలాలు బొండాడ కాలువకి అవతల ఉన్నాయి. ప్రస్తుతం పడవల్ మీద కాలువ దాట వలసి వస్తుంది. ఈ కాలువకి తక్షణమే వంతెన నిర్మానం. 
12. భీమవరంలో ఆక్యా కల్చర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి మరియు ఆగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజి ఏర్పాటు. 

భీమవరం ఒక మోడల్ సిటిగా ఎదుగుదలకు, 
భీమవరం ఒక కమర్షియల్ కాపిటల్ గా నిలబడాలంటే, 
భీమవరం ఆంద్రాకు ఒక ఆక్వా అగ్రికల్చర్ సెంటర్ గా తీర్చిదిద్దాలంటే, 
మన జనసేన అభ్యర్ధి పులపర్తి ఆంజినేయులు (అంజి బాబు) గారిని లక్ష ఓట్ల మెజారిటితో గెలిపించి, భీమవరాన్ని భాగ్వవంతమైన నగరంగా తీర్చి దిద్దుద్దాం. 
గ్లాస్ గుర్తుపై మీ ఓటు - భీమవరం అభివృద్దికి చోటు. 

ఇట్లు,
సురేష్ కరోతు (ఉత్తర అమెరిక)