అమెరికా - డల్లాస్ మహానగరంలో బందరు బంధువుల ఆత్మీయ కలయిక
చిరంజీవి సినిమాలో మీది తెనాలి మాది తెనాలి అన్నట్లు డల్లాస్ మహానగరంలో "మీది బంధరు మాది బంధరు" అని మచిలీపట్నం వాస్తవ్యులు అంతా ఒకచోట చేరి, కొందరు 20 మరియు 30 సంవత్సరాల తరువాత కూడా అనుకోకుండ ఒకరినొకరు కలుసుకున్నారు తమ బాల్య స్నేహాన్ని మరియు పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఎరా , ఎరా అని పిలుచుకొని ఎంతో సంబరపడ్డారు.
ఈ కార్యక్రమాన్ని దొరరాజు మరియు గిరీష్ మద్దుల గార్లు వారి పర్యవేక్షణలో నిర్వహించారు.
బందరు ముచ్చట్లు చెప్పుకున్నారు మరియు వారి దగ్గరి బంధువుల్లా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.బందరు యొక్క స్ధితి గతులు , అక్కడ వాతావరణం మరియు ఇప్పుడు వున్న పరిస్థులను ఒకరికొకరు చర్చించుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సుబ్బుకోట, ఆనంద్ కూచిబొట్ల, శేఖర్ పులి, రవివర్రే, ఉడతు వెంకట రమణ తదితరులు హాజరయ్యారు.
మచిలీపట్నం నుండి చాలా మంది పారిశ్రామికవేత్తలు మరియు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు వారి విజయగాథలను చెప్పుకున్నారు మరియు వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటారని హామీ ఇచ్చారు. వారు కొత్త స్టార్ట్-అప్ లను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నాము అన్నారు మరియు ఔత్సహికులకు తమ వంతు సహాయం ఎల్లప్పుడూ చేస్తాం అన్నారు. పారిశ్రామికవేత్తలు తమ స్థానిక ప్రతిభావంతులకు అవకాశం కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా చేరారు మరియు ప్రతి ఒక్కరూ ఊరి వారితో సరదాగా, ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు.ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో కూడా ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి ఒకరికొకరు సహాయం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఇంత గొప్ప సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ఈవెంట్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియచేశారు.
హాజరైన అతిథులందరికీ ఆలివ్ మిటాయి స్వీట్ బాక్స్‌లను దొరరాజు గారు పంపిణీ చేశారు. ఆంధ్ర తెలుగు భోజనం అతిథులందరికీ వడ్డించబడింది మరియు చాల రుచికరంగా ఉంది.
మే 3న మిల్పిటాస్లో జరగబోవు మచిలీపట్టణం పూర్వ విద్యార్థుల కలయికకు అందరిని సాదరంగా ఆహ్వానించారు.
Article By: శివ పల్లప్రోలు