Loading...

మనసు పలికే మౌన రాగాల ఆత్మీయ వేడుక - గతము తలచి, ఘనత పెంచే ఆత్మీయ వేదిక

మన తెలుగు వారు ఎక్కడ ఉన్నా మనసు చెప్పిందే చేస్తారు... అది వృత్తిలో అయినా,  ప్రవృత్తిలో అయినా!! 

రోజువారీ జీవితంలో మనం ఎన్నో పనుల్లో నిమగ్నమై ఉన్నా కానీ, మన మనసు మాత్రం అనేక మౌన రాగాలను, హృద్య గీతాలను ఆలపిస్తూనే ఉంటుంది. 

మన మనసు పలికే మౌన రాగాలను సుందర సుమధుర గీతంగా స్వర పరచడానికి అమెరికాలో నివాసం ఉంటున్న మన తెలుగు వారి కోసం “ఆత్మీయ నేషనల్ కాన్ఫరెన్స్ - 2024 పేరుతో ఓ చక్కటి వేడుకను - మన కోసం సరైన వేదికను సన్నద్ధం చేసేసింది. 

అమెరికాలోని డల్లాస్ ఫ్రిస్కో హోటల్ & కన్వెన్షన్ సెంటర్ లో  ఆగష్టు 30 నుండి సెప్టెంబర్ 1 వరకు ఈ వేడుక పండుగ వాతావరణంలో జరుగనున్నది. 

ఐకమత్యం వెల్లి విరిసే ఈ శుభ సందర్భంలో మనందరి హృదయ స్పందనను ఒక్క త్రాటి మీదకి తెచ్చి, మరపు రాని జోష్ ను నింపుతూ సందడి చేస్తూనే… మరోవైపు స్ఫూర్తిని నింపే అర్థవంతమైన కార్యక్రమంగా  "ఆత్మీయ" తీర్చి దిద్దుతూ సర్వ హంగులతో  సిద్ధం అవుతోంది. 

 "ఎడ్యుకేట్ -  ఎన్‌రిచ్ -  ఎంపవర్ మరియు ఎలివేట్" అనే నాలుగు ప్రధాన అంశాలను రథ చక్రాలుగా మలచుకుని ముందుకు వచ్చిన ఈ కార్యక్రమం నిర్దేశించిన లక్ష్యం దిశగా పయనం కొనసాగిస్తోంది. ఈ లక్ష్య సాధనకు అవసరమైన పూర్తి స్థాయి శ్రమను ఆత్మీయ బృందం కొనసాగిస్తోంది. 

అమెరికాలోని మన ఆత్మీయ సభ్యుల కెరీర్ తోడ్పాటు మరియు మద్దతు, రియల్ ఎస్టేట్,  ఫైనాన్షియల్ వెల్నెస్, హెల్త్ అవేర్ నెస్, ఎంటర్‌ప్రెన్యూరియల్ స్కిల్-బిల్డింగ్ వంటి వృత్తి -  ఉద్యోగ - జీవన భృతి సంబంధిత అంశాలను మరియు సాంస్కృతిక కార్యక్రమాలను కలిపి ఓ చక్కటి పూలమాల వలే కూర్చి ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా తెలుగు వారి కుటుంబ వాతావరణాన్ని ఏర్పరచడం, రేపటి తరం పిల్లలకు ఈ వారసత్వాన్ని అందించడం, యువతకు వ్యాపార నిర్వహణలో మెళకువలను తెలియజెప్పడం, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ పట్ల, స్టాక్ మార్కెట్ హెచ్చు తగ్గుల గురించి, విస్తృతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను గురించి చర్చించడానికి ఈ కార్యక్రమం ఉపయోపడనున్నది.

ఈ పండుగలో పాల్గొనబోయే  పిల్లలు, పెద్దలు తాము గడిపే ప్రతి ప్రతి క్షణాన్ని తమ జీవితాంతం గుర్తుంచుకునే గొప్ప జ్ఞాపకంగా మలచడానికి ఆత్మీయ బృందం చక చకా ఏర్పాట్లను నిర్వహిస్తోంది.

నెట్‌వర్కింగ్ & సాంఘికీకరణ: అమెరికా  అంతటా ఉన్న ఆత్మీయ సభ్యులతో స్నేహపూరిత వాతావరణంలో  మనోహరమైన చర్చలు, ఆలోచనలను పంచుకోవడం మరియు నిపుణుల నుండి సూచనలు పొందేలా ఈ వేడుక దోహదపడనున్నది.  మరియు మన తెలుగువారి వృత్తిపరమైన పరిధిని,  వ్యక్తిగత పరిధిని విస్తరించే గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌ల నిర్వహణ ద్వారా నిపుణుల నేతృత్వంలో వ్యాపారం, ఫైనాన్స్, వ్యక్తిగత అభివృద్ధి వంటి అన్ని అంశాలకు ఈ కార్యక్రమం వేడుక కానున్నది.

అదే విధంగా రోజువారీ పనుల ఒత్తిడిని అధిగమించే  కుటుంబ-స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించడం జరుగుతున్నది. మొత్తంగా చూస్తే వారాంతంలో  నేర్చుకోవడం, వినోదం మరియు సమాజ సత్సంబంధాల కోసం మీ మీ కుటుంబాలను తీసుకురండి అని ఆత్మీయ పిలుపునిస్తోంది. 

సాంస్కృతిక కార్యక్రమాలు,  సంగీతం, నృత్య ప్రదర్శనలు మరియు సాంస్కృతిక ప్రదర్శనలను ఆస్వాదించడానికి,  మీ పిల్లల ప్రతిభను ఎక్కువ మంది ప్రేక్షకులకు ప్రదర్శించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది.

టీవీ షో గాయకులు మరియు సంగీత విద్వాంసులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రేక్షకులను ఆద్యంతం అలరిస్తారు. సంగీతాన్ని  అనుక్షణం ఆస్వాదించే విధంగా సంగీత ప్రియుల కొరకు  గొప్ప సంగీత విభావరి ఏర్పాటు చేశారు.

తెలుగు వంటలతో స్వాగతం.. 

ప్రత్యేకమైన భారతీయ సంప్రదాయ వంటకాల శ్రేణితో రుచికరమైన వంటకాలను,  భోజన ప్రియులకు నోరూరించే అన్నిరకాల విందు భోజనాన్ని కొసరి కొసరి వడ్డించే విధంగా సిధ్ధం చేశారు. 

ఈవెంట్ షెడ్యూల్:

ఆగస్ట్ 30 (శుక్రవారం): అతిధుల రాక మరియు వారికీ విందు మరియు హోటల్ వసతి ఏర్పాట్లు. 

ఆగస్టు 31 (శనివారం): ముఖ్య ప్రసంగాలు, బ్రేక్‌అవుట్ సెషన్‌లు మరియు సోషల్ నెట్‌వర్కింగ్ , మెగా రక్తదాన డ్రైవ్‌లు.  

సెప్టెంబర్ 1 (ఆదివారం): మరిన్ని కీలక సూచనలు, సెషన్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు నెట్‌వర్కింగ్ అవకాశాలు.

100 మందికి పైగా అంకితభావంతో కూడిన వాలంటీర్లు అవిశ్రాంతంగా పనిచేస్తూ,... హాజరైన వారందరికీ సుసంపన్నమైన అనుభవాన్ని అందించడానికి  శ్రమిస్తున్నారు. 


మీ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, భావసారూప్యత గల వ్యక్తులతో మిళితం అవ్వడానికి మరియు ఆత్మీయ బంధువులతో సమయాన్ని గడపటానికి ఇదొక మంచి అవకాశం. ఈఅవకాశాన్ని ఎవ్వరు కోల్పోకండి అని మనవి.

ఈవెంట్ వివరాలు:

తేదీ: 30 ఆగస్టు - 1 సెప్టెంబర్ 2024

స్థానం: హిల్టన్ డల్లాస్ ఫ్రిస్కో హోటల్ & కన్వెన్షన్ సెంటర్

వృద్ధి మరియు విజయం వైపు ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగం కావడానికి దయచేసి ఆత్మీయ నాయకత్వ బృందాన్ని సంప్రదించండి!

ఆత్మీయ బంధువులందరికి ఇదే మా స్వాగతం!!!