‘‘ఆత్మీయ’’ ఆలింగనం డల్లాస్ లో వైభవంగా జరిగిన ఆత్మీయ మొదటి నేషనల్ కాన్ఫరెన్స్
‘ఆత్మీయ’ స్పర్శతో పెల్లుబికిన ఉత్తేజం - అమెరికా గడ్డ మీద తెలుగు కుటుంబాల సందడి
భూతల స్వర్గంగా ప్రపంచస్థాయి ఖ్యాతిగాంచిన అమెరికా గడ్డమీద మన తెలుగు కుటుంబాలు ‘‘ఆత్మీయ’’ ఆలింగనంతో తమ ఐక్యతను చాటుకున్నారు.
సొంత ఊరిని, అయిన వాళ్ళను విడిచి జీవితంలో ఎదగాలనే లక్ష్యంతో అమెరికాలో కెరీర్‌ను నిర్మించుకొని జీవితాన్ని కొనసాగిస్తున్న వందలాదిమంది తెలుగు సోదరులు తమ మూలాలను మరోసారి గుర్తుచేసుకుంటూ రెండురోజులపాటు ఆటవిడుపు పొంది, సేదతీరి ఆద్యంతం పండుగ వాతావరణంలో తమ ‘ఆత్మీయ’ తను చాటుకున్నారు.
ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు అమెరికాలోని డల్లాస్‌లోని హిల్టన్ డల్లాస్ ఫ్రిస్కో హోటల్ కాన్ఫరెన్స్ హాలు ఆవరణలో ఆత్మీయ నేషనల్ కాన్ఫరెన్స్ వైభవంగా జరిగింది. అమెరికాలో వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న వందలాది భారతీయ తెలుగు కుటుంబాలు ఈ ఆత్మీయ వేడుకకు హాజరయ్యారు. తమ మూలాలను గుర్తు చేసుకుంటూ, భావి లక్ష్యాలను సాధించడానికి పరస్పర అభివృద్ధి దిశగా అనేక నూతన బంధాలను ఈ వేదిక ద్వారా పెనవేసుకుని నూతన ఉత్తేజంతో ముందడుగు వేశారు.
ఈ కార్యక్రమంలో ఆత్మీయ ప్రెసిడెంట్ విజయ్ రామిశెట్టి మాట్లాడుతూ ఆత్మీయ ద్వారా 2022 నుండి నిర్విరామంగా, నిస్వార్ధంగా చేస్తున్న విభిన్నమైన కార్యక్రమాలను గురించి వివరించారు. ఆయన నేతృత్వంలో జరిగిన వార్షిక జాతీయ సమావేశం అత్యంత అర్థవంతమైన రీతిలో, అసాధ్యమైన అనేక అంశాలను సుసాధ్యాలు చేస్తూ కొత్త విషయాలను జోడిస్తూ వేడుకను విజయవంతంగా చేపట్టినందుకు ఆత్మీయ సభ్యులు ముక్త కంఠంతో అభినందనలు తెలియజేశారు.
బోర్డు సభ్యులు వెంకట్ యెరుబండి ఈ వేడుక విజయవంతం చేసే క్రమంలో చూపిన అంకిత భావాన్ని, శ్రమను ఆత్మీయ కుటుంబ సభ్యులు, బృంద సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. ఓం ప్రకాష్ నక్క తన సెషన్‌లో ఇమిగ్రేషన్ విధానంలో వచ్చిన మార్పు చేర్పులను వివరించడంతోపాటు, సభ్యుల సందేహాలకు పంతో ఓర్పుతో సమాధానాలిచ్చారు. అదేవిధంగా అద్భుతమైన డ్యాన్స్ చేసి అందరిలో జోష్ నింపేందుకు చేసిన శ్రమకు అందరూ ఆయనను అభినందించారు.
అదేవిధంగా ఈ మొత్తం వేడుక చివరి వరకు అన్ని దశలలోనూ వెన్నెముకగా నిలిచి అందరినీ ప్రోత్సహించినందుకు శశాంక్ నిమ్మలకు ఆత్మీయ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
సుమారు 1800మందికిపైగా ఆత్మీయ సభ్యులు ఈ వేడుకకు హాజరై తమ జీవితంలో మరచిపోలేని జ్ఞాపకాలను ఈ వేడుక ద్వారా మిగుల్చుకున్నారు. పూర్తి ఆహ్లాదకరమైన వాతావరణంలో వినోదంతోపాటు, విజ్ఞానాన్ని, విస్తృతమైన భావజాలాన్ని ప్రతి ఒక్కరిలో నింపిన ఆత్మీయ సమావేశం ఎంతో మంది అభివృద్ధికి బాటలు వేసింది. మరోవైపు ఈ వేడుకలో సేవాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ 60 మంది రక్తదానం చేసి తమ గొప్ప మనసును చాటుకున్నారు. ఈ రక్తదాన శిబిరానికి దుర్గా దేవిశెట్టి & పద్మ కందికట్టు సహకారం అందించారు.
ఈ వేడుకలో జై చిమట, మరియు హరి కురగాయల తదితరులు రోజువారీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. రమేష్ నాయనల,సత్య వెజ్జు, రాజ్ కిరణ్ తదితరులు ఏంతో ఓర్పుగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నడిపిన తీరుకు అభినందనలు వెల్లువెత్తాయి.
ఇంత పెద్ద వేడుకలో కమ్మని నోరూరించే రుచులతో వంటకాలను సమన్వయ పరచిన రామ్ ఉంగరాలను ప్రత్యేకంగా అభినందించారు. నర్సింహ సత్తి వేదికను సమన్వయ పరచడంలో చూపిన చొరవకు, శ్రీనివాస్ దేవిశెట్టి రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో చేసిన కృషికి, రామ్ ముత్యాల మరియు సిద్ధు కోలా రక్తదాన శిబిరం నిర్వహణలో బాధ్యతను సక్రమంగా నిర్వర్తించిన తీరుకు ఆత్మీయ సభ్యుల నుండి ప్రత్యేక అభినందనలు వెలువడ్డాయి. వంశీ పసుపులేటి గారు కల్చర్ & ఫుడ్ కమిటీలను చక్కగా సమన్వయం చేసారు.
ఇక ఈ మొత్తం ఈవెంట్ నిర్వహణకు అనేకమంది దాతలు తమ సహాయసహకారాలను అందించగా, అందరికీ ఆత్మీయ సంస్థ నిర్వాహకులు అభినందనలు తెలిపారు. అదేవిధంగా భూరి విరాళాలు అందజేసిన చక్రవర్తి పోషకులు వెంకట్ ఎరుబండి, రాజేష్ కళ్ళేపల్లి మరియు మహారాజ పోషకులు రవి వర్రె, శేఖర్ పులి, రాజ పోషకులు ఫణి ముత్యాల, చిట్టి ముత్యాల, పవన్ పాశం, సురేష్ కాకు వంటి దాతల సహకారం పట్ల ఆత్మీయ సభ్యులు సభాముఖంగా ధన్యవాదాలు తెలిపారు.
ఆత్మీయ సేవల గురించి క్లుప్తంగా.... 2022లో అమెరికాలో ప్రారంభమైన అత్యుత్తమ సంస్థలలో ఒకటైన ఆత్మీయ ‘సమిష్టి అభివృద్ది’, ‘మన కోసం మనం’, ‘ఆర్థిక ప్రగతి’, మరియు ‘స్త్రీ పురోగతి’ వంటి నినాదాలతో ప్రతి సంవత్సరం కృషిని కొనసాగిస్తూ అమెరికా మరియు ఇండియాలో అనేక విధాలుగా సేవలను అందిస్తోంది. ఆత్మీయ సంస్థ అందిస్తున్న సేవలు సమాజాన్ని ముందుకు నడిపించే మార్గంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఆత్మీయ సంస్థ ముఖ్యంగా అభ్యసనం, సంపన్నం, శక్తివంతం చేయడం, ఆధునీకరణ అనే 4 నినాదాలను ప్రకటించి వాటిని సక్రమమైన రీతిలో అమలు చేస్తూ వీటి పునాదులపై సభ్యుల ఎదుగుదలకు శ్రమిస్తోంది.ఈ నాలుగు మూల సూత్రాలతో చిత్తశుద్ధితో పనిచేస్తూ ప్రతి ఒక్కరినీ ఉన్నత స్థానాల దిశగా నడిపిస్తోంది. ఆత్మీయ కార్యక్రమాలు ఆత్మీయ ప్రతి సంవత్సరం ప్రజలకు, సమాజానికి ఉపయోగపడే కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తోంది.
ఆత్మీయ చేపట్టిన ఫైర్, ఆసరా, బెస్ట్, రియల్ ఉమెన్, ఇమిగ్రేషన్, కమ్యూనిటీ అఫైర్స్ వంటి అనేక కొత్త కార్యక్రమాలు, ప్రజలకు వివిధ రంగాలలో సహాయం అందిస్తున్నాయి. ఈ కార్యక్రమాలు సమాజంలో విశేష ప్రయోజనాలను కలిగి, సామూహిక అభివృద్ధికి దోహదపడుతున్నాయి.
ఫైర్(FIRE): ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ కార్యక్రమం ద్వారా సమగ్ర ఆర్థిక విద్య అందించి, సమాజంలో సంపద పెంచుకోవడంలో సహాయపడుతుంది.
బెస్ట్(BEST): బిజినెస్ మరియు ఎంట్రప్రెన్యూర్షిప్ సపోర్ట్ అండ్ ట్రైనింగ్ కార్యక్రమం ద్వారా వివిధ ఐటీ కోర్సులపై సాంకేతిక శిక్షణ అందిస్తోంది.
బడ్స్(BUDS): బడ్స్ ప్రోగ్రామ్ ద్వారా యువతను పోటీ ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తుంది.
ఆసరా(ASARA): ఎంఎస్ విద్యార్థులకు కాలేజ్, కెరీర్ మార్గదర్శకత, మరియు ఉద్యోగ అన్వేషణలో సహాయం అందిస్తుంది.
ఇమ్మిగ్రేషన్: సమాజ సభ్యులకు ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో మార్గదర్శకత మరియు సహాయం అందిస్తుంది.
రియల్ ఉమెన్: మహిళల శక్తివంతం కోసం, వారి సాధికారత సాధనకై వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
కమ్యూనిటీ అఫైర్స్: సంఘజీవితం, సాంస్కృతిక కార్యక్రమాలు, సంఫీుభావం మరియు పరస్పర సహకారాన్ని పెంచేందుకు సమూహ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
సేవా కార్యక్రమాలు: ఆత్మీయ సంస్థ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది, వాటిలో ముఖ్యమైనవి:
ఆరోగ్య సేవలు: అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య సహాయం, ఆరోగ్య సలహాలు, మరియు వైద్య శిబిరాలు అందిస్తోంది.
విద్యా సేవలు: నిరుపేద పిల్లల విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు స్కాలర్షిప్లు, పాఠ్యపుస్తకాలు, మరియు విద్యా సామాగ్రిని అందిస్తోంది.
ఆధ్యాత్మిక సేవలు: ఆత్మీయత, మానవీయ విలువలు, మరియు సాంప్రదాయాలను కాపాడుతూ, ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ఆత్మీయ సంస్థ ముఖ్య లక్ష్యాలు: ఆత్మీయ సంస్థ సేవా కార్యక్రమాల ద్వారా మానవత్వాన్ని, ప్రేమను, మరియు సమానత్వాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ సంస్థ ప్రతి ఒక్కరికి సేవా భావం పట్ల నిబద్ధతను కల్పించాలనే ఉద్దేశ్యంతో పనిచేస్తోంది.
Photos Link: https://photos.app.goo.gl/2fdEDMvDWQe2qAv99