Loading...

డల్లాస్(టెక్సాస్) లో ఆప్త టీమ్ తరుపున ఘనంగా పద్మవిభూషణ్ , మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు

తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి గారు చేసిన ప్రస్థానం అపూర్వం. ఆయన సినిమాల్లో చేసిన అద్భుత నటన, ప్రతిభ వల్ల ఆయన చిరంజీవి అనే పేరు నిలిచిపోయింది. వివిధ పాత్రల్లో చేసిన అద్భుత నటనతో కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్న చిరంజీవి గారు, ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

అయితే, చిరంజీవి గారి గొప్పతనం కేవలం సినిమా రంగంలోనే కాదు, సామాజిక సేవలో కూడా గొప్ప పేరు తెచ్చుకున్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ (CCT) ద్వారా ఆయన ఏర్పాటు చేసిన రక్త బ్యాంక్ మరియు కంటి బ్యాంక్ ఎంతోమందికి జీవనాంతకాలు అందించాయి. ప్రతి సంవత్సరం వేలాది రక్త యూనిట్లు ఇక్కడ దానం చేయబడుతున్నాయి, ఇది అనేక రోగులకు ప్రాణధారంగా మారింది. అలాగే కంటి బ్యాంక్ ద్వారా అనేక మంది కంటి వెలుగు పొందారు.

కోవిడ్ మహమ్మారి సమయంలో చిరంజీవి గారి సేవలు మరింత వెలుగులోకి వచ్చాయి. ఆపద సమయంలో అవసరమైన వారికి ఆక్సిజన్ సిలిండర్లు, కళాకారుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు  అవసరమైన సహాయం అందించారు , ఆయన సాయం పేద ప్రజలతో పాటు ప్రజలందరికీ అందించారు. చిరంజీవి గారి ఈ సేవలు ఆయన పెద్దమనసు, సమాజం పట్ల ఉన్న బాధ్యతను స్పష్టంగా చూపిస్తాయి.

తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ మెగాస్టార్ చిరంజీవిని భారత ప్రభుత్వం తన నిరాడంబరమైన సేవలకు మరియు నటనా ప్రతిభకు పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. చిరంజీవి గారు సమాజానికి మరియు ప్రజలకు తన సేవలను నిరంతరం కొనసాగిస్తున్నారు.

డల్లాస్ లో పుట్టినరోజు వేడుకలు:

ఆగస్ట్ 22న చిరంజీవి గారి పుట్టినరోజును స్పైస్ రాక్ రెస్టారెంట్ లో ఘనంగా జరుపుకున్నారు , పలువు మెగా అభిమానులు పాల్గొని సందడి చేశారు. 

శ్రీని పినిశెట్టి గారు మెగాస్టార్ పాటలు పాడి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. 

కేక్ కటింగ్: చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ప్రత్యేకంగా ఓ పెద్ద కేక్‌ను తయారు చేసి, ఘనంగా కట్ చేశారు. ఈ క్షణం మెగా ఫ్యామిలీగా బావించే అభిమానులు ప్రతీ ఒక్కరికీ గర్వకారణం అయింది. ఆద్యంతం సందడి వాతావరణంలో ఈ ఈవెంట్ ఎంతో గొప్పగా జరిగింది. 

స్పైస్ రాక్ ఓనర్ రాజేష్ వెల్నాటి గారు బాంక్యేట్ హాల్ మరియు స్నాక్స్ హాజరైన అభిమానులందరికి ఎంతో ప్రేమతో అందించారు. 

ఈ ఈవెంట్ లో పలువు ఆప్త ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు ముఖ్యంగా నటరాజు యెల్లూరు (ఆప్త Ex. President), శివ కొప్పరాతి, ప్రియా అన్నాబత్తిన (RVP), సునీల్ తోట , సుధాకర్ అందే , గణేష్ చలమలశెట్టి, వీర కోట తదితరులు  పాల్గొన్నారు. 

ఈ ప్రత్యేక రోజుని పురస్కరించుకుని, ఆప్త టీమ్ తరఫున మన అందరూ కలసి మన ప్రియతమ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మీరు ఇంకా ఎన్నో విజయాలు సాధించి, సంతోషం మరియు ఆరోగ్యం మీ జీవితంలో లభించాలని మనసారా కోరుకుంటున్నాము అన్నారు.

 

--------> Dallas Apta Team, USA  <-----------