Loading...

ఆప్త డల్లాస్ టీమ్ అద్వర్యం లో ఉగాది & శ్రీరామ నవమి వేడుకలు , అంబరాన్నంటిన సంబరాలు

తెలుగు వారు ఎక్కడ ఉన్నా తొలి తెలుగు సంవత్సరాదైన  ఉగాదిని  ఘనంగా జరుపుకుంటారు. అంధులో బాగంగా ఆప్త డల్లాస్ లీడర్షిప్ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది సంబరాలు రెండు వేలకు (2000+)  పైగా వచ్చిన అతిదులతో అంగరంగ వైభోగంగా జరుపుకున్నారు. ఇది డల్లాస్‌లోని NRI ఈవెంట్‌ల చరిత్రలో ఒక సూపర్ సక్సెస్ ఈవెంట్, ఇది ఒక మరపురాని మైలురాయి.

మన తెలుగింటి విందు భోజనం. మన పిల్లలకి మన సంస్కృతి, సాంప్రదాయాలని పరిచయం చేసిన గొప్ప వేదిక ఈ ఉగాది & శ్రీరామ నవమి సంబరాలు...

పిల్లలు మరియు పెద్దలు చేసిన డాన్స్ పెరఫార్మన్సెస్ అతిధులను ఆద్యంతం మంత్ర ముగ్దులను చేశాయి. తెలుగుదనం ఉట్టిపడేలా అందరు మంచి సాంప్రదాయకమైన వస్త్రాలు ధరించిరావడం వలన సందడి వాతావరణం నెలకొంది.  ఈవెంట్ ప్రవేశ ద్వారం వద్ద, కార్యక్రమానికి హాజరైన అతిథులందరికీ ఉగాది పచ్చడి & పానకం అందించారు.

ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం తయారు చేయబడిన ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలని ఈ పచ్చడి ఇచ్చే సందేశం మరియు శ్రీరామ నవమికి పానకం వడపప్పు ప్రత్యేకంగ  అందించారు.

జ్యోతి ప్రజ్వలన : జాతీయ గీతం మరియు జ్యోతి ప్రజ్వలనతో  ఉగాది & శ్రీరామ నవమి ఈవెంట్ ప్రారంభమైంది. ఆ తరువాత విఘ్నేశుని పాటతో ఆరంభమైన ఈ కార్యక్రమం దివ్యమైన దేవుడిని ఆరాధించి, కొత్త సంవత్సరం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఆప్త డల్లాస్ టీం స్వాగతం పలికి, వారి దగ్గరి బంధువుల్లా ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు.

అతిథులందరికీ దగ్గర ఉండి శివ కొప్పరాతి, ప్రియా అన్నాబత్తిన, సునీల్ తోట,సురేష్ కోడె, సురేష్ అగరం, సాయి గంగిశెట్టి, శివ మెరికినపల్లి, సుబ్బు చెన్నం, మహేష్ కర్రి, సురేష్ గోన, సాయి మోహన్ శీలం సెట్టి, సుధాకర్ అందె, వంశీ అన్నంగి మరియు విజయ స్పందన ఈటె తదితరులు వారికి అపురూప స్వాగతంతో ఆతిధ్యం అందించారు.

వేదిక అలంకరణ: వేదికను పూలతో మరియు డిజిటల్ లైట్ బాక్గ్రౌండ్ తో  చాలా అద్భుతంగా అలంకరించారు, దానికి LED స్క్రీన్ జోడించబడింది. LED స్క్రీన్ పై వివిధ ఆప్త ఈవెంట్ చిత్రాలు, ఆప్త సేవలు మరియు ఆప్త కోర్ టీమ్ మరియు వాలంటీర్ టీమ్ చిత్రాలు మరియు సందేశాలను ప్రదర్శించింది.

ఈవెంట్‌ను ఆశీర్వదించడానికి అనేక ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన ఆప్త మేనేజ్‌మెంట్ & RVPలను ఆప్త డల్లాస్ బృందం ఘనంగా సత్కరించింది.

సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ప్రదర్శనలు: 

  • లోకల్ డల్లాస్ టీమ్  నుండి ఆప్త టాలెంట్, ఆప్తా యంగ్ టాలెంట్ టీమ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి లీడర్‌షిప్ టీమ్ కూడా ముందుకు వచ్చి లైవ్ పెర్ఫార్మెన్స్ చేసింది.
  • ఈవెంట్ ముగిసే వరకు శృతి నండూరి & అర్జున్ అద్దేపల్లి సంగీత కచేరీ కొనసాగింది.
  • వెరైటీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై రోబో గణేశన్ చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలచింది. 
  • రాజ్ వెంకట్ అండ్ టీమ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు.
  • మధురాజ్ మరియు యుటిడి డ్యాన్స్ గ్రూపులు తెలుగు పాటల ప్రత్యేక నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకర్షించింది.
  • అంతకు ముందు రోజు హాజరైన ఆప్త బిజినెస్ ఫోరం సభ్యులు అందరు ఈ వేడుకకు విచ్చేశారు, ఈ కార్యక్రమం మినీ కన్వెన్షన్ ని తలపించింది.
  • ముఖేష్ చిచ్చులకు  ఆప్త బృందం అతని అభిమాన పాట కజ్రారేను ప్లే చేసి నివాళులర్పించింది.
  • అపర్ణ చిక్కం గారు తన అందమైన పెయింటింగ్స్ కోసం సైలెంట్ వేలం నిర్వహించి, ఆ డబ్బును జనసేన & ఆప్తా టీమ్‌కి విరాళంగా ఇచ్చారు.

బహుమతులు మరియు ట్రోఫీలు:

వాలీ బాల్ పురుషుల జట్టు & త్రోబాల్ మహిళల జట్లు విజేతలు మరియు రన్నర్లు ట్రోఫీలు అందుకున్నారు .ఈ స్పోర్ట్స్ ఈవెంట్‌ను కళ్యాణి పత్తి మరియు లక్ష్మణ్ ప్రగడరెడ్డి సమన్వయం చేసారు.

ఏప్రిల్ నెలలో సభ్యత్వం తీసుకున్న కొత్త సభ్యులకు రాఫెల్ డ్రా విజేతలకు ఐప్యాడ్ బహుమతిగా అందించారు. మెంబర్‌షిప్ టీమ్ ఛైర్ మధు దాసరి, వైస్ చైర్ రాజి రావుల బృందం కొత్త సభ్యులను సభ్యత్వం తీసుకునేలా ప్రోత్సహించారు.

పావని నున్న ప్రోగ్రామ్ ప్లానింగ్ మరియు ఎగ్జిక్యూషన్ అద్భుతంగా నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి భారతదేశం నుండి చాల మంది  పెద్దలు అతిథులుగా హాజరయ్యారు. ఆప్త పెద్దలు ప్రేరణాత్మక ప్రసంగాలు చేశారు, ముఖ్యంగ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ త్రినాథ్ ముద్రగడ , బోర్డు సెక్రటరీ వెంకట్ సాన , ఎఎసి చైర్ సత్య అడ్డగర్ల, నటరాజు యిల్లూరి , గోపాల గూడపాటి, పూర్వపు బోర్డు చైర్ సుబ్బు కోట మరియు నేషనల్ టీమ్ డాక్టర్ పూర్ణచందర్ సిరికొండ, సురేష్ చిలంకుర్తి మరియు శివ యర్రంశెట్టి తదితరులు.

అందరూ ఐక్యంగా ఉండాలని, అప్పుడే తమ జీవితంలో ఏదైనా సాధించగలరని, అలాగే ఇతర ఆప్తా సభ్యులకు మరియు సమాజానికి సహాయం చేయాలని ఆకాంక్షించారు.

నువ్వు నేను కలిస్తే మనం, మనం మనం కలిస్తే జనం, జనం జనం కలిస్తే ప్రభంజనం అని రవి వర్రే గారు తెలియజేసారు. 

డల్లాస్ లో ఆప్తులు ప్రభంజనంలా పెరుగుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారు ఎల్లప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు మరియు వారి ఆప్తులను కలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

సునీత కొండేటి , విశేషు రేపల్లె , పూర్ణిమ అన్నంగి, సురేష్ లింగినేని , సాయి ప్రియా మర్రాపు & భవాని నైనాల యాంకరింగ్ తో ఈవెంట్ ని సాయంత్రం 4 గంటలకు మొదలైన రాత్రి 11:30 వరకు కొనసాగింది, ఏ మాత్రం  ఎనర్జీ సడలకుండ ప్రేక్షకుల మధ్య చాలా జోష్‌ని తెచ్చారు.

ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులందరికీ ఆప్తా డల్లాస్ బృందం ఆలివ్ మిటాయి స్వీట్ బాక్స్‌లను పంపిణీ చేసింది.

ప్రత్యేక అభినందనలు: 

ఈ ఈవెంట్‌ని గ్రాండ్‌ సక్సెస్‌ చేసిన ఆప్త మహిళా బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. పూర్ణిమ అన్నంగి, లావణ్య గేదెల, రూపా కనకాల ,గాయత్రి వూటుకూరు, రాజీ రావుల , అనూష దాసం , శ్రావ్య బగ్గు, సునీత మేరువ, లిఖిత, దేవి కొటారు మరియు రేఖ  తదితరులు.

DJ టీమ్ ప్రశాంత్ కొల్లిపర & కళ్యాణి పత్తి ఈ కార్యక్రమానికి ఆడియో మరియు వీడియోను అద్భుతంగా అందించారు.

గ్రాండ్ స్పాన్సర్ రాజేష్ కళ్లేపల్లి , ప్లాటినం స్పాన్సర్లు బసవ శంకర్, సురేష్ చిలంకుర్తి, రాజేష్ వెల్నాటి, గోల్డ్ స్పాన్సర్లు డాక్టర్ పూర్ణ సిరికొండ, శివ కొప్పరాతి , శ్రీకాంత్ తటవర్తి, ఫణి ముత్యాల, ముఖేష్ పర్ణ, డాక్టర్ జయ బత్తిన, డాక్టర్ హిమ బిందు జ్యోతుల మరియు శ్రీరామ్ జెట్టి తదితరులు....స్పాన్సర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియచేసారు .

గత రెండు వారాల నుండి అవిశ్రాంతంగా పని చేస్తున్న వాలంటీర్లందరు అద్భుతమైన టీమ్ వర్క్ చేసారు. దాదాపు 70 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమానికి సహకరించారు.వారిలో ముఖ్యంగా కిరణ్ ముదిగొండ, అనిల్ చలమలశెట్టి,  నాగేశ్వర్ చందన, శివ పల్లప్రోలు, గోపాల్ పతివాడ, గణేష్ చలమలశెట్టి, రవి కళ్లి , శరత్ కవి, జయరాం శంకరసెట్టి, వైభవ్ మరియు శ్రీకాంత్ అంజూరి తదితరులు.

ఫోటోగ్రాఫర్: అనుపమ్ తాటి                    

Article by : శివ పల్లప్రోలు