టెక్సాస్‌లో జనసేన గళం: జనసేన పార్టీని ఎన్నికల సంఘం అధికారికంగా గుర్తించి గాజు గ్లాసు కేటాయించినందుకు మద్దతుగా జనసైనికుల సమావేశం
జనసేన పార్టీని ఎన్నికల సంఘం అధికారికంగా గుర్తించి, గాజు గ్లాసు గుర్తును కేటాయించిన సందర్భంగా, యూఎస్ టెక్సాస్ రాష్ట్రం, ఆష్టిన్ నగరంలో జనసైనికుల సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో పార్టీకి మరింతగా మద్దతు అందించే మార్గాలపై విస్తృతంగా చర్చించారు.
పార్టీ బలోపేతానికి – పోరాటమే మార్గం అనే నినాదంతో, ప్రతినెలా $10-$20 వరకు పార్టీ ఫండ్‌గా అందించేందుకు సభ్యులు ముందుకొచ్చారు. జనసేన సిద్ధాంతాలను మరింత విస్తృతంగా ప్రచారం చేయడం, ఇతర పార్టీల విధానాలపై అవగాహన పెంచుకోవడం వంటి కీలక అంశాలపై చర్చించారు.
సోషల్ మీడియాలో జనసేన బలం – సైనికుల బాధ్యత!
సోషల్ మీడియా ద్వారా పాజిటివ్ కంటెంట్‌ను విస్తృతంగా ప్రచారం చేయడం, పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో ఉన్న విశేషమైన ఆదరణను మరింతగా విస్తరించడం, ఆయన చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరించడం గురించి సభ్యులు చర్చించారు.
ఈ సమావేశం ద్వారా, టెక్సాస్ జనసైనికులు తమ పార్టీ పట్ల ఉన్న బాధ్యత, నిబద్ధతను మరింత బలపరిచారు. జనసేన విజయానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ప్రసాద్ చిగిలిశెట్టి , భాను సిద్ధం తదితరులు పాల్గొన్నారు