Loading...

వరద బాధితులను ఆదుకునేందుకు చంద్రబాబు సహాయనిధి విరాళం

విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు దాతలు స్పందించి సాయం అందిస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్)కి గానన్ డంక్టరీ, కోఆపరేటివ్ లిమిటెడ్ సంస్థ రూ. 25 లక్షల విరాళం ప్రకటించింది. ఆ సంస్థ ఎండీ మనోజ్కుమార్సింగ్, సీఓఓ బండారు శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ డీవీ రమణ.. ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబుకు సంబంధిత చెక్కు అందజేశారు. మిగతావారు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ను కలిసి విరాళాలు అందించారు. తాడిపత్రికి చెందిన రోటరీ క్లబ్ ప్రతినిధులు రూ.1.1 లక్షలు, పల్నాడు జిల్లా అర్చకసేవా సంఘం ప్రతినిధి జి. కృష్ణమాచార్యులు రూ.లక్ష, వేములపల్లి శివరామకృష్ణ రూ.50 వేలు, గుంటూరుకు చెందిన ఆర్. రవికుమార్ రూ.50 వేలు, కదిరికి చెందిన ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ ప్రతినిధి కె.శ్రీనివాసులు రూ.20 వేలు, కన్నెగంటి నవ్యత రూ.8 వేలు ఇచ్చారు.

విజయవాడ వరద బాధితులకు .3.50 లక్షల విరాళం

విజయవాడ వరద బాధితులకు ఆర్థిక సాయం నిమిత్తం పెనుకొండ నియోజక వర్గ దాతలు అందజేసిన రూ.3.50 లక్షలను సీఎంఆర్ఎఫ్ కు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత అందజేశారు. ఈ మేరకు గురువారం మంత్రిమండలి సమావేశం అనంతరం సీఎం చంద్రబాబునాయుడుకు మంత్రి చెక్ లను అందజేశారు. పెనుకొండ పట్టణానికి చెందిన ప్రగతి, రేవతి, బాబా ఫక్రూద్దీన్, దాదా పీర్, బాబా మహిళా గ్రామ సమాఖ్యల్లోని సభ్యులు అందజేసిన రూ.1.50 లక్షలు, బూదిలి గ్రామానికి చెందిన భ్రమరాంభిక మహిళా సంఘ సభ్యులు ఇచ్చిన రూ.50 వేలు, ఆంధ్రప్రదేశ్ బ్యాంకు రిటైరీస్ ఫెడరేషన్ రూ.లక్ష, పరిగి మండలకేంద్రానికి చెందిన ఇటుక బట్టీ యజమానులు రూ.50 వేలు... ఇలా మొత్తం రూ.3.50 లక్షలను సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ...విజయవాడ వరద బాధితులను ఆదుకోడానికి ముందుకొచ్చిన పెనుకొండ నియోజక వర్గానికి చెందిన దాతలను అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరికొందరు దాతలు బాధితులను ఆదుకోడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

  

వరద బాధితుల Rs 30, 85,000/- రూపాయల విరాళం

విజయవాడ వరద బాధితుల సహాయార్ధం యర్రగొండపాలెం నియోజకవర్గం తరపున Rs 30,85,000/- రూపాయల చెక్కును అమరావతి సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు విరాళంగా అందించారు. ఈ సందర్బంగా భారీ విరాళం అందించి వరద బాధితుల పక్షాన అండగా ఉన్నందుకు చంద్రబాబు గారు టీడీపీ ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు గారికి విరాళాలు అందించిన వారికి అభినందించారు. కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.