Loading...

టాటా నూతన చైర్మన్ గా నోయెల్ టాటా

  టాటా ట్రస్ట్‌ ఛైర్మన్‌గా నోయెల్‌ టాటా.. ఏకగ్రీవంగా ఎన్నుకున్న ట్రస్ట్‌ బోర్డ్

 

తిరుచ్చి నుంచి షార్జాకు  బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం  ; 

  తిరుచ్చి నుంచి షార్జాకు   బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం   తలెత్తింది. తిరుచ్చి విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం 141 మంది    ప్రయాణికులతో శుక్రవారం సాయంత్రం    5.40గంటలకు షార్జా బయలుదేరింది. గాల్లోకి   ఎగిరిన కాసేపటికే హైడ్రాలిక్స్   సమస్య కారణంగా   చక్రాలు లోనికి ముడుచుకోలేదు. ల్యాండ్ చేయలేని పరిస్థితి నెలకొనడంతో 2 గంటలకు పైగా ఆకాశంలోనే   చక్కర్లు కొట్టింది. విషయం తెలిసిన వెంటనే తమిళనాడు రాష్ట్ర సీఎం స్టాలిన్ సంబంధిత అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు చర్మ తీసుకోవాలని నిర్దేశించారు. ఈ క్రమంలో     విమానంలో ఇంధనం తగ్గిన తర్వాత ల్యాండ్ చేయాలని పైలట్లు నిర్ణయించారు. రాత్రి 8.15 గంటలకు తిరిగి తిరుచ్చి విమానాశ్రయంలోనే సురక్షితంగా దించారు. ముందు జాగ్రత్తగా ఇక్కడి విమానాశ్రయంలో 20కు పైగా అంబులెన్స్లు, అగ్నిమాపక వాహనాలను అధికారులు సిద్దంగా ఉంచారు. విమానం సురక్షితంగా కిందకు దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చాకచక్యంతో వ్యవహరించిన విమాన పైలట్, ఇతర సిబ్బందిని    సీఎం స్టాలిన్ 'ఎక్స్' వేదికగా అభినందించారు.