Loading...

తమిళనాడులోఘోర రైలు ప్రమాదం

తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. తిరువళ్లూరు జిల్లా కవారైపెట్టై రైల్వే స్టేషన్ సమీపంలో వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలును ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన రైలు మైసూరు- దర్భంగా మధ్య నడిచే భాగమతి ఎక్స్ ప్రెస్‌గా తెలుస్తోంది. గూడ్స్ రైలుకు సంబంధించిన పలు బోగీలు పట్టాలు తప్పగా.. ఎక్స్ ప్రెస్ రైలుకు సంబంధించిన రెండు బోగీలు మంటల్లో చిక్కుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే పోలీసులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. రాత్రి వేళ కావడంతో సహాయక చర్యలకు ఆంటకం కలుగుతోంది.

మళ్లీ అదే తప్పు జరిగింది ; 

గతేడాది ఒడిశా పరిధిలో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో వందలమంది ప్రయాణికులు మృతి చెందారు. అప్పట్లో గ్రీన్ సిగ్నల్స్ పడటం, రైలు ట్రాక్ మారడం వంటి తప్పిదాలు జరిగాయి. సరిగ్గా అదే తీరులో భాగమతి ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. రాత్రి 8.27 సమయంలో ఈ రైలు పొన్నేరి స్టేషన్ దాటింది. కవరై పెట్టె స్టేషన్కు వస్తున్న సమయంలో ఆ రైలు ప్రధాన లైనుపై నుంచి కాకుండా లూర్లైన్లోకి వెళ్లడం, ఆ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టడం క్షణాల్లో జరిగిపోయాయి. ఈ సమయంలో ఎక్స్ప్రెస్ రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా రైల్వే అధికారులు వెల్లడించారు. | ప్రమాద సమయంలో రైలు వేగం గంటకు 75 కి.మీ. ఉన్నట్లు తెలిపారు. గూడ్స్ రైలును వేగంగా వచ్చి ఢీకొనడంతో భాగమతి ఎక్స్ప్రెస్లోని లోకోతో పాటు సుమారు 12, 13 ఎలెచ్బీ కోచ్లు పట్టాలు తప్పాయి. ఇంజిన్ తర్వాత ముందుభాగంలో లగేజీ కోచ్ పాటు 10 ఏసీ కోచ్లో ఉన్నాయి. ప్రయాణికులున్న హెచ్1, ఏ2 కోచ్లు ఏపీ నుంచి కర్ణాటక, తమిళనాడు వైపు వెళ్లే ప్రధాన మార్గంలో పట్టాల పైకి ఎగిరి పడ్డట్లు సాక్షులు చెబుతున్నారు.