Loading...

పిల్లలు మారం చేస్తున్నారు అని సెల్ ఇచ్చారో ఇక అంతే బ్యాంక్ బ్యాలన్స్ కాళి

సైబర్‌ నేరగాళ్లు రకరకాల ఆధునిక పద్ధతుల్లో అమాయక ప్రజల నుంచి డబ్బు లాగేందుకు అనేక మోసాలకు పాల్పడుతున్నారు. వేటపాలెం మండలంలో ఓ మహిళా వ్యాపారి సైబర్ నేరగాళ్ల బారినపడింది.   వేటపాలెం మండలం కటారివారిపాలెం కు చెందిన కాటంగారి అనిత అనే చిరు వ్యాపారి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని నాలుగు లక్షల రూపాయల నగదును పోగొట్టుకుంది.  చిరు వ్యాపారం చేసుకుంటూ కాస్తంత బిజీగా వుండే సమయంలో అనిత తన మొబైల్ ఫోన్ ను ఇంట్లోని తన కూతురుకి ఇచ్చింది.   సరదాగా ఫోన్ చూస్తున్న కూతురు తెలిసో, తెలియకో అందులోని సైబర్ నేరగాళ్ళు పంపిన ఓ లింక్ ను ఓకే చేసింది.  అప్పటికే కాచుకొని కూర్చున్న సైబర్ నేరగాళ్లు చిక్కిందే తడవుగా వాళ్ళపని వాళ్ళు చేసుకున్నారు. అనితకు చెందిన వేటపాలెంలోని యూనియన్ బ్యాంకు ఖాతాలో ఉన్న నాలుగు లక్షల రూపాయల నగదును విడత వారీగా ఈ ఏడాది ఆగస్టు 18వ తేదీ నుంచి సెప్టెంబర్ 24వ తేదీ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు ఈ మొత్తం నగదును అపహరించార   దీంతో మోసపోయామని తెలుసుకున్న సదరు బాధితురాలు వేటపాలెం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది.   కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.