ఏపీలో ఇళ్లు లేని పేదలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం
ఏపీలో అర్హులైన పేదలకు త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు నిన్న కలెక్టర్ల సమావేశం లో ప్రకటించారు. '2029 నాటికి అర్హులందరికీ ఇళ్లు నిర్మిస్తాం. స్థలాలు లేని పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు మంజూరు చేస్తాం. ఇళ్ల నిర్మాణానికి ఎస్సీలు, చేనేతలకు అదనంగా రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75వేలు ఇస్తాం. వైసీపీ వదిలేసిన నిర్మాణాలనూ పూర్తి చేస్తాం' అని సీఎం స్పష్టం చేశారు.