Loading...

వడ్డీ వారి పాలెం ZPH స్కూల్లో ఘనంగా మహానటి సావిత్రి గారి 88వ జయంతి వేడుకలు

మహానటి సావిత్రి గారి 88వ జయంతి సందర్భంగా వడ్డి వారి పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సావిత్రి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడినాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోట సుబ్రహ్మణ్యం గారు హాజరై, సావిత్రి గారి సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా, పాఠశాల బస్సు రవాణా ఖర్చుల నిమిత్తం నెలకు రూ.70,000 చొప్పున రెండు సంవత్సరాలకు అవసరమైన మొత్తాన్ని విరాళంగా అందించేందుకు కోట సుబ్రహ్మణ్యం గారు తమ సమర్థనను తెలియజేశారు. ఈ గొప్ప సంస్కరణకు గ్రామ సర్పంచ్ వడ్డి లక్ష్మీ లక్ష్మోజి గారు పాఠశాల మరియు గ్రామ పక్షాన ధన్యవాదాలు తెలిపారు. సావిత్రి గారితో పాఠశాలకున్న అనుబంధాన్ని గుర్తుచేసి, ఈ కార్యక్రమానికి ప్రాముఖ్యతను తెలియజేశారు.

బోస్టన్ గ్రూప్ ఆఫ్ కంపెనీల ఛైర్మన్ NRI శ్రీ సుబ్బు కోట గారు US & India అంతటా చాలా గొప్ప సేవలు చేస్తున్నారు. అతను భారత అంధుల క్రికెట్ జట్టుకు బలమైన మద్దతుదారుల్లో ఒకరు. అమెరికా లోని భారత్‌కు చెందిన సంస్థలకు భారీగా నిధులు విరాళంగా ఇచ్చారు.

 

పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. మాధవి గారు కోట సుబ్రహ్మణ్యం గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో PMC చైర్మన్ గాడికోయి రామకృష్ణ గారు, గ్రామ పెద్దలు వడ్డి హనుమంతరావు గారు, బస్సు మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ తులం రమణ గారు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

ఈ వేడుకలు సావిత్రి గారి జీవితం, సేవలను స్మరించుకుంటూ, పాఠశాల అభివృద్ధి పట్ల చైతన్యాన్ని కలిగించాయి.